నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2లో తాజాగా పవన్ కల్యాణ్ రానున్నట్లు ఆహా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు వీడియోలను సైతం రిలీజ్ చేసింది ఆహా. అయితే.. ఈ ఎపిసోడ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బావతో తిరిగే పవన్ కళ్యాణ్ బావమరిదితో తిరిగితే తప్పేం ఉంది?? అని ఆయన సెటైర్లు వేశారు. అంతేకాకుండా.. పేమెంట్ ప్రోగ్రాం…ఇద్దరికీ డబ్బులు ఇస్తారు.
ఎవరి డైలాగులు వాళ్ళకు ముందే ఇస్తారు. బావ కోసం బావమరిది ప్రయత్నం. బావ కోసం పని చేయటానికి బాలయ్యకు మరో అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కొడుకు అయి ఉండి చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు బాలయ్య. సోము వీర్రాజు, జీవీఎల్ కు కాపు రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం చేత ఆమోదింప చేయాలి. ఇక్కడ విజయవాడలో కూర్చుని కబుర్లు చెప్పటం ఎందుకు??. పవన్ కళ్యాణ్ టీడీపీ నేతల జపం చేస్తున్నాడని జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారు. కాపులు ముఖ్యమంత్రి అవ్వడం తప్పు కాదు..అత్యాశ కాదు.వైఎస్సార్, జగన్ లా సమాజాన్ని ప్రేరేపితం చేసే వ్యక్తి రావాలి . పవన్ కళ్యాణ్ కాపులను పొట్లం కట్టి టీడీపీ నేతల చేతిలో పెడుతున్నాడు. అంటూ వ్యాఖ్యానించారు పేర్ని నాని.