అసెంబ్లీ లాబీల్లో..పేర్ని పంచ్..కేశవ్ కౌంటర్.!

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేల మధ్య చిన్నపాటి వార్ మొదలైపోయింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మొదట గవర్నర్ ప్రసంగం నదిచింది. అయితే ప్రసంగంలో వైసీపీ స్క్రిప్ట్‌ని గవర్నర్ చేత చదివిస్తున్నారని..గవర్నర్ స్పీచ్‌కు టి‌డి‌పి ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. గవర్నర్ చేత పూర్తిగా అబద్దాలు చెప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు గవర్నర్ చేత..జగన్‌కు భజన చేయించడం ఏంటని విరుచుకుపడ్డారు.

ఇక అసెంబ్లీలో గవర్నర్ చేత అబద్దాలు చెప్పించడం సరికాదని చెబుతూ టి‌డి‌పి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టి‌డి‌పి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని..ఎదురుపడి..ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలో పేర్ని ఒక పంచ్ వేశారు. మళ్ళీ కేశవ్ గెలవాలని కోరుకుంటున్నానని పేర్ని అన్నారు. దీనికి కేశవ్ కౌంటర్ ఇస్తూ..నో డౌట్ 1994 ఫలితాలు…2024లో రిపీట్ అవుతాయని అన్నారు.

అయితే కేశవ్ గెలవాలని పేర్ని అనడం వెనుక ఒక స్టోరీ ఉంది. ఎప్పుడైతే ఉరవకొండలో కేశవ్ గెలుస్తారో..అప్పుడు రాష్ట్రంలో టి‌డి‌పి అధికారంలోకి రాదు. మళ్ళీ అలా జరగాలని పేర్ని పరోక్షంగా అన్నారు. 1999 ఎన్నికల్లో కేశవ్ ఓడిపోతే, టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది. 2004, 2009, 2019 ఎన్నికల్లో కేశవ్ గెలిస్తే.. టి‌డి‌పి అధికారంలోకి రాలేదు. 2014లో కేశవ్ ఓడిపోతే..టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది.

కేవలం ఒక్క 1994 ఎన్నికల్లో కేశవ్ గెలవడం, రాష్ట్రంలో టి‌డి‌పి అధికారంలోకి రావడం జరిగాయి. అందుకే కేశవ్ కూడా 1994 ఫలితాలు రిపీట్ అవుతాయని అన్నారు. మొత్తానికి ఇద్దరి మధ్య కౌంటర్లు బాగానే నడిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news