పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటిసారిగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్రాల తీరే కారణం అని… రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని సూచించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా… రాష్ట్రాలు తగ్గించలేదని గుర్తు చేశారు. రాష్ట్రాల తీరు వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. బీజేపేతర రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాలని కోరారు.
పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు… రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని సూచన
-