నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమా?

-

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ (48ఏళ్లు) మంగళవారం రాత్రి మృతి చెందారు. శ్వాసకోశ సమస్యతో మృతి చెందినట్లు వెద్యులు వెల్లడించారు. అయితే విద్యాసాగర్ మృతిపై తమిళనాడు స్థానిక వార్త పత్రికల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి.

మీనా-విద్యాసాగర్

నటి మీనా నివసిస్తున్న ప్రాంతంలో పావురాలు అధిక సంఖ్యలో ఉంటాయి. వాటి వ్యర్థాల వల్ల వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్‌కు శ్వాసకోశ సమస్య తలెత్తిందని, అందుకే ఆయన కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్నారని పత్రికల్లో కథనాలు ప్రచూరితమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో విద్యాసాగర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైందని వైద్యులు చెబుతున్నారు. అయితే విద్యాసాగర్ ఊపిరితిత్తులు మార్పిడి చేయించాలని సూచించినప్పటికీ.. దాతలు దొరక్కపోవడంతోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version