ఈ 11 దేశాలకు వెళ్తే.. వాళ్లే డబ్బులిచ్చి మరీ మిమ్మల్ని ఉండమంటారట..! కానీ..

-

మనం ఎక్కడికైనా వెళ్లాలంటే..ఆసక్తితో పాటు..అక్కడి వెళ్లటానికి సరిపడా డబ్బుకూడా కావాలి. గోవా వెళ్లటానికే కనీసం పదివేలు పక్కన పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేశాల్లోని ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళ్తే..అసలే ఖర్చులే ఉండవట. వారే డబ్బులిచ్చి మరీ అక్కడ ఉండమంటారట. అవి చాలా సంపన్నదేశాలు. అక్కడే ఉండిపోవచ్చు. వ్యాపారం చేసుకోవచ్చు. మీరు వ్యాపారం చేయాలంటే కావాల్సిన డబ్బును కూడా వాళ్లే ఇస్తారట. అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా అనుకుంటున్నారా..కానీ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి అలా చూసి ఇలా వచ్చేసే టూరిజం ప్రదేశాల కిందకి రావు. అక్కడ జీవించాల్సి ఉంటుంది. వ్యాపారాలు చెయ్యాల్సి ఉంటుంది.ఏంటో ఈ ప్రదేశాలు ఇప్పుడు చూద్దాం.

అలస్కా, అమెరికా

మీకు మంచు, శీతాకాలం వాతావరణం ఇష్టమైతే… ప్రశాంత జీవనం కావాలి అనుకుంటే అమెరికాలోని అలస్కా వెళ్లొచ్చు. అక్కడ కాలుష్యం చాలా తక్కువ, మంచి గాలి ఉంటుంది. మీరు అక్కడ పర్మనెంట్‌గా ఉండేందుకు అలస్కా రాష్ట్రం మీకు డబ్బు ఇస్తుంది. ప్రస్తుతం అలస్కా జనాభా వేగంగా తగ్గిపోతోంది. దాంతో అక్కడి ప్రభుత్వం ఈ స్కీమ్ ను తెచ్చింది. ప్రభుత్వమే పెట్టుబడి డబ్బు ఇస్తుంది. అలాగే… సహజ వనరులు కూడా సమకూర్చుతుంది. అక్కడ మైనింగ్ చెయ్యవచ్చు. సంవత్సరం పాటూ ఉండేందుకు ప్రభుత్వం రూ.1.5 లక్షలు ఇస్తుంది. ఇలా ఉండేవారు… రాష్ట్రం విడిచి కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం వెళ్లకూడదని కండీషన్లు ఉన్నాయి.

వెర్మోస్ట్, అమెరికా

అమెరికాలోని వెర్మోస్ట్ రాష్ట్రం పర్వతాల్లో ఉంటుంది. ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వెర్మోస్ చాలా అందంగా ఉంటుంది. చాలా క్లీన్‌గా చూడగానే వెళ్లి ఉండిపోవాలి అనిపించేలా ఉంటుందట. అందుకే పర్యాటకులు చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. ప్రస్తుతం అక్కడ 6,20,000 మంది నివసిస్తున్నారు. అంటే చాలా తక్కువ మందే అని చెప్పాలి.. అందుకే అక్కడి ప్రభుత్వం ప్రజలను ఆహ్వానిస్తుంది. అలా వచ్చే వారికి రూ.7.4 లక్షలు ఇస్తోంది. వాళ్లు రెండేళ్లు అక్కడ ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2018 మేలో… వెర్మోస్ట్ గవర్నర్ ఫిల్ స్కాట్ ఓ బిల్ పాస్ చేశారు. అక్కడికి వెళ్లేవారు ఆ డబ్బుతో జీవిస్తూ… ఉద్యోగం చేసుకుంటూ బతకవచ్చు. అయితే… వారు ఆ రాష్ట్రానికి చెందిన పౌరుడు మాత్రం అవ్వరు.

అల్బినెన్, స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్‌లోని చిన్న పట్టణం అల్బినెన్. ఇక్కడ రకరకాల వెన్నలు లభిస్తాయట. ఇక్కడ కేవలం 240 మంది మాత్రమే ఉంటున్నారు. మీ వయసు 45 ఏళ్ల లోపు అయితే… మీకు స్విస్ ప్రభుత్వం రూ.20 లక్షలు ఇస్తుంది. 45 కంటే ఎక్కువ వయసుంటే… రూ.40 లక్షలు ఇస్తుంది. దంపతులై… ఓ బిడ్డ ఉంటే మరో రూ.8 లక్షలు అదనంగా ఇస్తుంది. భలే ఉందికదా ఈ ఆఫర్. కానీ ఇక్కడే ఉంది ఓ చిక్కు. అక్కడ మీరు పదేళ్లు ఉండాలి. ఇల్లు కొనాలీ లేదా కట్టుకోవాలి. ఇందుకు మీకు రూ.48 లక్షలు వస్తాయి. మీకు ఒక బిడ్డ ఉంటే… రూ.56 లక్షలు వస్తాయి. మీరు కట్టే ఇల్లు మీకు సెకండ్ ఇల్లు కాకూడదు. అదే ప్రధానమైన ఇల్లు కావాలి. మీరు స్విట్జర్లాండ్ పౌరుడు అయివుండాలి. మీరు స్విట్జర్లాండ్ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉండాలి. అరే ఇచ్చినట్లే ఇచ్చి ఇన్ని కండీషన్స్ పెట్టారేంటో.

పోంగా, అస్టూరియాస్, స్పెయిన్

స్పెయిన్‌లోని పోంగా గ్రామం దేశంలోనే పురాతనమైనది. అక్కడ సుమారు 1000 మంది దాకా ఉంటున్నారు. వారి ఎకానమీని మెరుగుపరచుకునేందుకు వారు యువతీ, యువకుల్ని ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం యువజంటకు రూ.1.5 లక్షలు ఇస్తున్నారు. అక్కడ బిడ్డ పుడితే… మరో రూ.1.5 లక్షలు ఇస్తారట. అంటే… బిడ్డతో వెళ్లేవారు రూ.5 లక్షల దాకా పొందగలరు. ఇదో మంచి ఊరు. చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి బాగా ఉంటుంది. పైగా పచ్చగా కళకళలాడుతూ క్లీన్‌గా ఉంటుంది. అందువల్ల ఇక్కడికి వెళ్లాలనుకునేవారికి ఇది బాగా నచ్చుతుందని స్థానికులు అంటున్నారు.

కాండెలా, ఇటలీ

ఇటలీలో ఇదో చిన్న పట్టణం. ఇందులో అంతా కలిపి 2,700 మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఉండాలి అనుకునేవారికి సింగిల్ అయితే రూ.68,000 పొందవచ్చు. అదే జంట అయితే రూ.1 లక్ష పొందవచ్చు. కుటుంబంలో ముగ్గురు ఉంటే… రూ.1.5 లక్షల దాకా వస్తుంది. అదే ఫ్యామిలీలో నలుగురైదుగురు ఉంటే… రూ.1.7 లక్షల దాకా ఇస్తారు. డబ్బుతోపాటూ… టాక్స్ బెనెఫిట్స్ కూడా ఉంటాయి. అందుకే… ఈ మనీ ఆఫర్ కొద్దిగా తక్కువగా ఉన్నా… ఇక్కడికి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇటలీకి ఆల్రెడీ మంచి చారిత్రక గుర్తింపు ఉండటం వల్ల కాండెలా హాట్ పర్మనెంట్ డెస్టినేషన్ అవుతోందనటంలో ఏమాత్రం సందేహం లేదు.

డబ్లిన్, ఐర్లాండ్

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో ఎవరైనా సరే సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. అక్కడ ఎంటర్‌ప్రైజ్ ఐర్లాండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఉంది. దాని ద్వారా… ప్రపంచం నలుమూలల్లో ఉన్న వ్యాపారవేత్తల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు సొంతంగా స్టార్టప్ ప్రారంభించాలి అనుకుంటే మీరు అక్కడ ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే… మీకు కావాల్సిన డబ్బు, ఇతరత్రా అన్నీ వాళ్లే సమకూర్చుతారు. మీరు అక్కడికి వెళ్లి స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడే వ్యాపారం ప్రారంభించాలి. మీరు పెట్టుకున్న అప్లికేషన్‌ను వారు ఆమోదిస్తే.. మీ పంట పండినట్లే అంటున్నారు స్థానికులు.

మారిషస్

మీకు బిజినెస్ మోడల్స్, ఫైనాన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ ఇతర ఫీల్డులలో మంచి నాలెడ్జి ఉంటే… మీరు ఎలాంటి పెట్టుబడీ అవసరం లేకుండా ట్రాపికల్ ఐలాండ్ మారిషస్‌సలో వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇందుకోసం మారిషస్ ప్రభుత్వం మీకు రూ.34,000 దాకా ఇస్తుంది. ఐతే… ఇదేమంత తేలిక కాదు. మీరు మీ వ్యాపార ఐడియాను మారిషస్ ప్రభుత్వానికి విపులంగా వివరించాలి. వారికి అది నచ్చాలి. అక్కడి కమిటీ దాన్ని పరిశీలిస్తుంది. ఆ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు వీలవుతుందో లేదో చూస్తుంది. బాగుంటుంది అనుకుంటే ఈ ఆఫర్ మీకు ఇస్తుంది.

శాంటియాగో, చిలీ

దక్షిణ అమెరికా దేశం చిలీకి ఆల్రెడీ పర్యాటకపరంగా చాలా గుర్తింపు ఉంది. 2010లో ఈ దేశ రాజధాని అయి శాంటియాగోలో ఓ స్టార్టప్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. అక్కడ దాదాపు మూడేళ్లపాటూ ఉండాల్సి ఉంటుంది. ఓ మంచి ఐడియాతో కూడిన స్టార్టప్ ప్రారంభించాలి. ఇందుకోసం చిలీ ప్రభుత్వం రూ.37 లక్షలు ఇస్తుంది. ఇందులో భాగంగా ఏడాది పాటూ వర్క్ వీసా, వర్క్ ప్లేస్, కాంటాట్స్ నెటవర్క్ వంటి సదుపాయాలు కల్పిస్తుంది. అయితే మీరు చెప్పే స్టార్టప్ ఐడియా చిలీ ప్రభుత్వానికి నచ్చాలి. ఇది సక్సెస్ అవుతుంది అని భావిస్తే… ఈ ఆఫర్ మీకు లభిస్తుంది.

నయాగరా ఫాల్స్

ఇది మనకు బాగా తెలుసు. ప్రపంచంలోనే ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లలో ఒకటి. నిజానికి నయగరా ఫాల్స్ అనేది న్యూయార్క్‌లోని చిన్న పట్టణం . ఇక్కడ 50,000 మంది దాకా జీవిస్తున్నారు. ఇక్కడ డౌన్‌టౌన్ హౌసింగ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఉంది. ఇది విద్యార్థులకు రూ.5.2 లక్షల దాకా ఆఫర్ ఇస్తోందట. ఆ విద్యార్థులు అక్కడే ఉంటూ… రెండేళ్లపాటూ పనిచెయ్యాలి. అప్పుడు ఆ పట్టణం… ఆ విద్యార్థి వార్షిక లోన్ పేమెంట్‌ని ఏడాదికి రూ.2,60,042 దాకా రీయింబర్స్ చేస్తుంది. అలాగే రెండేళ్లకు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటే రూ.5,20,084 దాకా రీయింబర్స్ చేస్తుంది.

యాంటికితెరా, గ్రీస్

గ్రీస్‌లోని యాంటికితెరాలో 40 మంది మాత్రమే జీవిస్తున్నారు. ఇదో దీవి. ఇక్కడ ఉండేవారికి నెలకు రూ.42,000 స్టేపెండ్ చెల్లిస్తారు. ఇలా మూడేళ్లపాటూ చెల్లిస్తారు. స్థలం, ఇల్లు ఇస్తారు. ఇదంతా ఎందుకంటే… ఈ దీవిలో జనాభా సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎవరూ రావడానికి ఆసక్తి చూపట్లేదు. కొన్నేళ్లుగా ఈ సమస్య తీరట్లేదు అందుకే ఇక్కడి ఆర్తడాక్స్ చర్చి… ఎవరైనా అక్కడ జీవించాలి అనుకుంటే… వారికి అన్ని ఏర్పాట్లూ చేస్తుంది. ఎవరైనా సరే ఇక్కడికి వెళ్లొచ్చు. ముఖ్యంగా గ్రీక్ ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ఎవరూ వెళ్లట్లేదు కాబట్టి భారతీయులు వెళ్లినా… రెడ్ కార్పెట్ పరచి మరీ ఆహ్వానిస్తారు.

న్యూ హావెన్ సిటీ

ప్రతిష్టాత్మక యాలే యూనివర్శిటీకి కేంద్రం ఈ న్యూ హావెన్ సిటీ. ఇదో ప్రశాంతమైన నగరం. అమెరికాలోని కనెక్టికట్‌లో ఉంది. ఇక్కడ రూ.7.4 లక్షల దాకా ఆఫర్ ఇస్తున్నారు. ఇది వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేని రుణం. దీంతో ఓ ఇల్లు కొనుక్కోవాలి. అక్కడ ఐదేళ్ల పాటూ ఉంటే ఈ లోన్ తిరిగి చెల్లించాల్సిన పని లేదు. ఐదేళ్లు ఉండలేని వారు సుమారు రూ.22 లక్షలతో… ఎనర్టీ సేవింగ్ హోమ్ వస్తువులు కొనుక్కున్నా… లోన్ తిరిగి చెల్లించాల్సిన పని లేదు. దీంతోపాటూ ఎడ్యుకేషన్ కోసం రూ.29 లక్షల దాకా రియింబర్స్‌మెంట్ లోన్ ఇస్తున్నారు. న్యూ హావెన్ పబ్లిక్ స్కూళ్లలో విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్ చెప్పిస్తున్నారు.

చాలామందికి జీవితం మీద విరక్తి చెంది..అసలు ఇక్కడే ఉండాలనిపించదు. అలాంటివారు ఇలాంటి ప్లేస్ కి వెళ్లి హ్యాపీగా బతికేయొచ్చు. అయితే మీకు ఏమైనా ఇలాంటి ఇంట్రస్ట్ ఉంటే..ఒకసారి అన్నీ చెక్ చేసుకోని స్టెప్ తీసుకోవటం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news