గుడ్ న్యూస్.. లక్షకు పైగా ఇళ్ళు మంజూరు…ఇలా అప్లై చెయ్యండి..!

-

ఎప్పటి నుండో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా..? అయినప్పటికీ అవ్వలేదా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్లకి గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం తాజాగా లక్ష ఇళ్లకు పైగా నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది. అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

మోదీ సర్కార్ తాజాగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ కింద ఇళ్ళని నిర్మించడానికి ఒప్పుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, పుదుచెర్రీ, ఉత్తరఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ ఇళ్ళని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు.

సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 57వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి దాకా ఈ మిషన్ కింద 1.14 కోట్ల ఇళ్లకు మంజూరు లభించింది. 53 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది.

ఇంకా చాలా వరకు ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది. ఈ మిషన్ కోసం రూ.7.52 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. వీటిలో కేంద్రం వాటా రూ.1.85 లక్షల కోట్లు. ఇప్పటికే రూ.1.14 లక్షల కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..

దీని కోసం మీరు ముందుగా పీఎం ఆవాస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
సిటిజన్ అసెస్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఇక్కడకి వెళ్లి అప్లై మీద క్లిక్ చేయండి.
క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ, ఆఫర్డబుల్ హౌసింగ్, ఇండివీజువల్ హౌస్ కన్‌స్ట్రక్షన్, స్లామ్ రీడెవలప్‌మెంట్ అనేవి ఉన్నాయి.
మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది.
ఆన్‌లైన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
వివరాలని నింపేసి.. క్యాప్చా ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.
మీకు అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. అంతే.

Read more RELATED
Recommended to you

Latest news