కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. రాజ్య సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ జరిగేది కాదని విరమర్శించారు. కాంగ్రెస్ లేకుంటే దేశంలో సిక్కుల ఊచకోతలు ఉండేవి కాదని ప్రధాని అన్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరంగా మారిందని.. వారి ఆలోచనలు అర్బన్ నక్సైలైట్ లాగా ఉన్నాయని విమర్శించారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరంగా మారిందని సంచలన విమర్శలు చేశారు.
కరోనా సమయంలో చర్చించేందుకు రావాల్సింది ప్రతిపక్షాలను కోరితే.. కొన్ని పార్టీలు ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారని విమర్శించారు. దేశీయంగా తయారైన వ్యాక్సిన్లకు వ్యతిరేఖ ప్రచారం చేశారని కాంగ్రెస్ ని ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శించారు. మహాత్మా గాంధీ కూడా కాంగ్రెస్ ను కోరుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా.. కాంగ్రెస్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.