గుజరాత్ నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి పడిపోయిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 141 మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా విచారకమైనదనీ..మతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా వ్యక్తంచేశారు మోడీ. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోడీ. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యల్ని కొనసాగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు మోడీ. కాగా..ఆదివారం సాయంత్రం మచ్చు నదిపై బ్రిటిష్ కాలంనాటి వంతెన మరమ్మతులు చేసిన వారంరోజులకే కుప్పకూలింది.
బ్రిడ్జి కూలిన సమయంలో ఛత్ పూజకు సంబంధించి కొన్ని ఆచారాలు నిర్వహించడానికి ప్రజలు భారీగా గుమ్మికూడారు. ప్రమాద సమయంలో సుమారు 500 మంది బ్రిడ్జిపై ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రాణాలతో బయటపడగా సోమవారం తెల్లవారుజాము వరకు ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం 141 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.