హైదరాబాద్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ఎప్పటిలాగే మోదీ.. ప్రియమైన సోదర, సోదరీమణులారా అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు.
అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభించాం. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వరస్వామి నగరంతో కలిపాం. రాష్ట్రంలో రూ.11 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. అని అన్నారు.
అంతకుముందు.. ప్రధాని మోదీ సభా వేదిక పైనుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు, జాతీయ రహదారుల నిర్మాణానికి, రూ.1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ భవన నిర్మాణానికి, రాష్ట్రంలో రూ.7,864 కోట్లతో కొత్తగా 6 జాతీయ రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్- సికింద్రాబాద్ డబ్లింగ్ లైన్ను జాతికి అంకితం చేశారు. అనంతరం సికింద్రాబాద్- మేడ్చల్ మధ్య ఎంఎంటీఎస్ రెండో దశ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.