Breaking : ఈ నెల 26న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాక..

-

వరుసగా తెలంగాణలో జాతీయ నాయకులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జేపీ నడ్డా, రాహుల్‌ గాంధీ ఆ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణలో పర్యటించారు. అయితే ఇప్పుడు తాజాగా.. ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ ఈ నెల ఈ నెల 26న తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ రానున్నారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్స‌వంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అంతేకాకుండా రామ‌గుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల క‌ర్మాగారాన్ని కూడా ఆయ‌న హైద‌రాబాద్ నుంచే వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక పార్టీ ప‌రంగా కూడా మోదీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకునే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ ముఖ్య నేత‌ల‌తో మోదీ ప్ర‌త్యేకంగా భేటీ అవుతారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా.. మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికే దిశగా బీజేపీ తెలంగాణ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ అనంతరం బండి సంజయ్‌కు మోడీ ఫోన్‌ చేసి ప్రశంసించారు కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version