అధికార దాహంతో విపక్షాలు రగిలిపోతున్నాయి: ప్రధాని మోదీ

-

ఈ రోజు పార్లమెంట్ ఈవెనింగ్ సెషన్ లో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ విపక్షాలు తమ ప్రభుత్వంపై పెట్టిన నో మోషన్ పిటిషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు నో మోషన్ పిటిషన్ పెట్టడంపై నాకు ఎంతగానో ఆశ్చర్యం కలిగించిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇక విపక్షాలు పార్లమెంట్ లో మాట్లాడిన తీరు దేశ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందంటూ కామెంట్ చేశారు. విపక్షాలు ఈ ఎన్నికలకు ముందు అయినా మంచి ఆలోచన తీరుతో , మరియు ప్రజలకు సేవ చేయాలన్న మంచి ఉద్దేశ్యంతో వస్తారని అనుకున్నా, కానీ ఎంతగానో నన్ను నిరాశపరిచారు. అయిదు సంవత్సరాల సుదీర్ఘమైన సమయం ఇచ్చినా ఎందుకో మారలేదు అంటూ మోదీ మాట్లాడారు. వీరికి ప్రజల మీద బాధ్యత, సమాజ శ్రేయస్సు కన్నా అధికార దాహమే ఎక్కువగా ఉందంటూ మోదీ కామెంట్ చేశారు మోదీ.

ఇప్పుడున్న మా విపక్షాలకు పేదల ఆకలి అంటే ఏమిటో తెలియదు, కానీ అధికారం మాత్రం కావాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version