షాకింగ్‌ : శునకానికి రిమాండ్‌.. పోలీసుల పాట్లు..

-

చట్టాలు, నిబంధనలు మనుషులకైనా శునకాలకైనా ఒక్కటే అని ఈ ఘటన నిరూపిస్తుంది. మద్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు నిందితులతో పాటు ఓ శునకాన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితులతో సహా శునకానికి కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే నిందితులను జైలుకు పంపిన పోలీసులు.. శునకాన్ని మాత్రం పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. దీంతో ఆ శునకం పోలీసులు చుక్కలు చూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌‌లోని బక్సర్ జిల్లా ఘజీపూర్‌లో ఈ నెల 6న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో విదేశీ మద్యాన్ని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు.. రామ్‌సురేష్ యాదవ్, భువనేశ్వర్ యాదవ్ పట్టుబడ్డారు. ఆ కారులో వారితోపాటు జర్మన్ షెపర్డ్ శునకం కూడా ఉండడంతో దానిని కూడా వారితోపాటే స్టేషన్‌కు తరలించారు. నిందితులిద్దరినీ జైలుకు పంపిన పోలీసులు శునకాన్ని మాత్రం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.

Your 10 Most Popular Questions about German Shepherd Dogs - Vivamune Health

ఇప్పుడదే వారికి పెద్ద తలనొప్పిగా మారింది. దానికి రోజూ ఆహారం పెట్టలేక పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. దానికి రోజూ పాలు, మొక్కజొన్న పెట్టాల్సి వస్తోందని బక్సర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ తెలిపారు. అది ఆంగ్లంలో ఇచ్చిన ఆదేశాలను మాత్రమే పాటిస్తోందని, హిందీలో చెబితే వినడం లేదని పేర్కొన్నారు. అది తినే టైమింగ్, ఏం తింటుందో తెలియకపోవడం ఇబ్బందిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, దానికి తిండిపెట్టేందుకు రోజూ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుండడంతో స్టేషన్ సిబ్బంది చందాలు వేసుకుంటున్నారు. ఆహారం విషయంలో అది ఏమాత్రం రాజీపడడం లేదని, ఆహారం విషయంలో కాస్తా అటూ ఇటూ అయినా గట్టిగా మొరుగుతూ నానాయాగీ చేస్తోందని సిబ్బంది వాపోతున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news