కానిస్టేబుల్ పై దాడి చేసిన చైన్ స్నాచర్లను అరెస్టు చేసిన పోలీసులు

-

కానిస్టేబుల్ పై దాడి చేసిన చైన్ స్నాచార్లను అరెస్టు చేశారు పోలీసులు.ఒకే రోజు సైబరాబాద్ కమిషనరేట్ లోని గచ్చిబౌలి,కూకట్పల్లి,రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డరు ఈ ముఠా.నిందితులు కర్ణాటక కు చెందిన ఇషన్ నిరంజన్ నీలంనాలి(21),రాహుల్(19) గా గుర్తించారు. వారి వద్ద నుంచి తాపంచ మరియు రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉత్తర్ ప్రదేశ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఈ నిందితులు ఇద్దరు ఈ నెల 25 న ఒకే రోజు గచ్చిబౌలి,కూకట్పల్లి,రామచంద్రపురం లలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.తిరిగి మరుసటి రోజు 26 న మియపూర్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారనీ..మియపూర్ నుండి BHEL మీదుగా నింధితులు పారిపోయే ప్రయత్నం చేశారని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ లను అలెర్ట్ చేసి వెహికల్ చెకింగ్ నిర్వహించామని తెలిపారు సిపి స్టీఫెన్ రవీంద్ర.అదే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ,కానిస్టేబుల్ థేబేస్,కానిస్టేబుల్ రవి లు నింధితులను గుర్తించి పట్టుకున్నారని తెలిపారు.

ఈ క్రమంలో నింధితులు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పై వివిధ భాగాల్లో మొత్తం 7 చోట్ల కత్తి తో దాడి చేశారని తెలిపారు.అయినప్పటికీ నింధితులను వదలకుండా పట్టుకున్నారని తెలిపారు.ప్రస్తుతం యాదయ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని,హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.వారి ప్రతిభ,ధైర్య సాహసాలు పోలీస్ వ్యవస్థకు మంచి గుర్తింపు తెచ్చాయన్నారు.పట్టు బడ్డ నిందితుల వద్ద నుండి 1 తాపంచ, 13 లైవ్ బుల్లెట్లు,1 రివాల్వర్, 2 లైవ్ బులెట్ లు,రెండు మొబైల్ ఫోన్ లు,ఒక ద్విచక్ర వాహనం,రెండు కత్తులు,47 గ్రాములు విలువచేసే మూడు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news