Breaking : అయ్యన్న పాత్రుడిపై మరో కేసు..

-

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీ మాహానాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చేలా అయ్యన్న మాట్లాడారని ఆరోపిస్తూ ఏయూ జేఏసీ ఆయనపై విశాఖపట్టణం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 41ఎ కింద అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు గత రాత్రి నర్సీపట్నంలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అయ్యన్న లేకపోవడంతో ఆయన పెద్దకుమారుడు విజయ్‌తో మాట్లాడారు.

ఆ నోటీసులు తనకు ఇవ్వాలని విజయ్ కోరినా ఇవ్వకుండా ఆయనకే ఇస్తామని వెళ్లిపోయారు పోలీసులు. ఈ విషయాన్ని త్రీ టౌన్ సీఐ రామారావు నిర్ధారించారు. అయితే ఇటీవలే అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలోని తన ఇంటిని అక్రమంగా నిర్మించారని ఇరిగేషన్ అధికారులు ఆయన ఇంటి వెనుక గోడను కూల్చివేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తూ.. చలో నర్సీపట్నంకు పిలుపునిచ్చారు. గత కొన్ని రోజలుగా ట్విట్టర్ వేదికగా వైసీపీ మంత్రులను అయ్యన్న పాత్రుడు టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version