సీన్ రివర్స్ : సీఎం కేసీఆర్ పై అస్సాంలో పోలీసు కేసులు

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేవలం అస్సాం చుట్టే తిరుగుతున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి భిశ్వంత్ శర్మ ఇటీవల కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబంపై అస్సాం సీఎం చాలా నీచంగా మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీ కంటే మొదటగా స్పందించారు.

ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీనిపై స్పందించారు. ఇందులో భాగంగానే నిన్నటి నుంచి అస్సాం ముఖ్యమంత్రి పై తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కేసులు పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ఊహించని షాక్ తగిలింది.

అస్సాం లో సీఎం కేసీఆర్ పై పోలీస్ కేసు నమోదు అయింది. రెండు రోజుల క్రింద ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్… పుల్వామా, సర్జికల్ స్ట్రైక్ పై ఆధారాలను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాడు. ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీకి చెందిన అస్సాం నేతలు ఆ రాష్ట్రంలో కేసులు పెట్టారు. వారు కేసులు పెట్టిన ప్రకారం అక్కడి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తాజాగా అస్సాం పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news