డ్రగ్స్ ని అరికట్టడంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషించాలి – సీఎం కేసీఆర్

-

హైదరాబాదులోని బంజారాహిల్స్ లో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..యావత్తు ప్రభుత్వానికి ఇదొక మూల స్థంభం లా ఉండబోతుందన్నారు. కరోనా కారణంగా భవనం ప్రారంభోత్సవం ఆలస్యం అయ్యిందన్నారు సీఎం.దీని వెనుక ఎంతో మంది పోలీసుల కష్టం ఉందన్నారు. పోలీస్ లందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు.పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు.

మొదట 24 ఫ్లోర్స్ అనుకున్నాం..కానీ కొన్ని కారణాల వల్ల 20 ఫ్లోర్స్ కి కుదించామన్నారు.ప్రపంచ భూతం సైబర్ క్రైమ్ గురించి తాజాగా మహేందర్ రెడ్డి తో మాట్లాడానని..విదేశాల్లో సైబర్ క్రైమ్ పై ఎటువంటి విధానం ఉందో తెలుసుకోమని చెప్పానన్నారు.డ్రగ్స్ మహమ్మారి భవిష్యత్తు తరాల బంగారు భవితను నాశనం చేస్తుందన్నారు సీఎం కేసీఆర్.డ్రగ్స్ అరికట్టడం లో పోలీసు లు ప్రధాన పాత్ర నిర్వహించాలన్నారు.డ్రగ్ ఫ్రీ లో దేశం లోనే తెలంగాణను నంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్నారు.

డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్ లో రిటైర్ కాబోతున్నారని..ఆయన్ను అంత ఈజీ గా వదులుకోమన్నారు. యూనిఫామ్ లేకపోయినా ఆయన్ను సలహాదారుడి గా సహకారం తీసుకుంటామన్నారు సీఎం.8 సంవత్సరాల నుండి అశాంతి చెలరేగకుండా అద్భుతంగా పోలీసింగ్ ఉందన్నారు. అమెరికా లోను ఒక్కప్పుడు డ్రగ్స్ విపరీతంగా ఉండేదని..ఇప్పుడు డ్రగ్స్ భూతం అమెరికా లో 90 శాతం తగ్గిందన్నారు. మన దగ్గర కూడా డ్రగ్ అడ్డిక్స్ట్ ను పూర్తిగా నియంత్రించాలన్నారు సీఎం కేసీఆర్.హైదరాబాద్ లో చాలా వరకు నేరాలు తగ్గు ముఖం పట్టాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news