రాయలసీమ అంటే వైఎస్సార్సీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సీమలో టీడీపీకి పెద్దగా బలం లేదనే సంగతి తెలిసిందే…మొదట్లో కాంగ్రెస్ బలంగా ఉండగా, ఇప్పుడు వైసీపీని సీమ ప్రజలు ఆదరిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే పైచేయి. గత ఎన్నికల్లో సీమలో మొత్తం 52 సీట్లు ఉంటే…వైసీపీ 49 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
కర్నూలు, కడపలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది…చిత్తూరులో 14కి 13, అనంతపురంలో 14 సీట్లకు 12 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా సీమలో వైసీపీనే సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. సీమ ప్రాంతమే మళ్ళీ జగన్ ని అధికారంలోకి తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. సీమలో మళ్ళీ వైసీపీ వన్ సైడ్ గా గెలిస్తే మాత్రం టీడీపీకి మళ్ళీ అధికారం దూరం అవుతుంది.
అందుకే చంద్రబాబు ఈ సారి సీమపై గట్టిగానే ఫోకస్ చేశారు…ఇక్కడ కొన్ని సీట్లు అయిన గెలుచుకుంటే…అధికారంలోకి రాగలమని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుని, సీమలో ఒక 30 శాతం నుంచి 40 శాతం సీట్లు గెలుచుకుంటే అధికారంలోకి రావోచ్చు అనేది బాబు ప్లాన్. ఇదే క్రమంలో సీమలో కొన్ని సీట్లపై బాబు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఎలాగో అనంత అంటే టీడీపీకి కంచుకోట ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బాబు చూస్తున్నారు. కనీసం ఇక్కడ 9-10 సీట్లు గెలుచుకోవాలని బాబు…అక్కడ నేతలకు గైడెన్స్ ఇస్తున్నారట.
ఇక తన సొంత జిల్లా చిత్తూరు విషయానికొస్తే..ఇక్కడ కనీసం ఆరు సీట్లు అయిన గెలుచుకోవాలని బాబు భావిస్తున్నారట. అటు జగన్ సొంత జిల్లా కడపలో కనీసం 2 సీట్లు, కర్నూలులో 4-5 సీట్లు గెలుచుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చు అనేది బాబు అభిప్రాయం. మొత్తం మీద 20-22 సీట్లు వరకు గెలుచుకుని, మిగిలిన సీట్లు ఉత్తరాంధ్ర, కోస్తాలో గెలుచుకుంటే…అధికారం దక్కించుకోవచ్చని అనుకుంటున్నారు. మరి చూడాలి ఫ్యాన్ కోటలో బాబు ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో.