హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ శిబిరంలో ముసలం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈటల ప్రధాన అనుచరుడు సమ్మిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి స్థానిక టీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సమ్మిరెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమ్మిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం లాంఛనమేనని అంటున్నారు. సమ్మిరెడ్డి బాటలో మరికొందరు ఉన్నట్లు టీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు.
టీఆర్ఎస్‌లో ఈటల రాజీనామాతో హుజురాబాద్‌లో ఉపఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. ఎలాగైనా గెలిచి సత్తాచాటాలని ఈటల భావిస్తున్నారు. ఈటలను ఓడించి అధిపత్యాన్ని చూపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.