బ్రేకింగ్ : వైఎస్ షర్మిల అరెస్ట్… పోలీస్ స్టేషన్ కు తరలింపు

-

వైఎస్‌ఆర్టీపీ అధినేత వైఎస్‌ షర్మిల అరెస్ట్‌ అయ్యారు. కాసేపటి క్రితమే… వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. షర్మిల నిరుద్యోగ – నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు… అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అనంతరం షర్మిలను మేడిపల్లి పీఎస్‌ కు తరలించారు. ఈ నేపథ్యం లో వైఎస్‌ఆర్టీపీ కార్యకర్తలు మరియు పోలీసులు మధ్య ఉద్రిక్తత నెలకొంది.

ఇక అంతకు ముందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. వందలమంది నిరుద్యోగులను హత్యా చేసిన హంతకుడు కెసిఆర్ అని.. ఏళ్లుగా నిద్రపోయి ఇప్పుడు గర్జనలు అంటూ ప్రతిపక్షాలు ముందుకు వస్తున్నాయని నిప్పులు చెరారు. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానంలో ఒక నిరుద్యోగి చనిపోతే కనీసం పరామర్శించారా? కనీసం పరామర్శించలేని రేవంత్ రెడ్డి ని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు.

తల్లికి గంజిపోయేలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్త అంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. కాంగ్రెస్ కెసిఆర్ కి అమ్ముడుపోయిందని…. నిజమైన ప్రతిపక్ష పాత్రా పోషిస్తే ఇన్ని ఆత్మహత్యలు జరిగేవా ? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ లు కెసిఆర్ ను ప్రశ్నించే స్థితిలో లేవని… కేటీఆర్ కి కాంగ్రెస్, బీజేపీ అమ్ముడుపోయాయన్నారు. నిరుద్యోగులకు అండగా తానుంటానని… దీక్షకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు అనుమతులు లేవు అంటున్నారని నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితిలో దీక్ష చేస్తానని స్పష్టం చేశారు వైఎస్‌ షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Latest news