కోమటిరెడ్డి బ్రదర్స్ జంప్…అద్దంకి హ్యాపీ?

-

ఎక్కడైనా బలమైన నేతలు పార్టీలు మారిపోతుంటే…సొంత పార్టీలోని నేతలు కాస్త ఆందోళన చెందుతారు…పార్టీ బలం తగ్గిపోతుందని ఆవేదన చెందుతారు. కానీ అదేంటో గాని కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నేతలు…జంప్ అయిపోతుంటే..సొంత పార్టీ నేతలే హ్యాపీగా ఫీలయ్యే పరిస్తితి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారిపోతుండటం…కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలకు ఆనందాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇంకా వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ ని వదిలేస్తారని తెలుస్తోంది. అయితే మొదట నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తూ బలమైన నేతలుగా ఉన్న వీరు వీడటం…కాంగ్రెస్ పార్టీకి నష్టమే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు నేతలు…వీరు వెళ్లిపోతే మంచిదే అన్నట్లు భావిస్తారు. వాస్తవానికి టి‌పి‌సి‌సి రేవంత్ రెడ్డితో…కోమటిరెడ్డి బ్రదర్స్ కు ముందు నుంచి పడటం లేదు. ఇక వారు పార్టీని వదలడం ఓ రకంగా రేవంత్ రెడ్డికి హ్యాపీ అని చెప్పొచ్చు. అందుకే ఆయన…కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతున్నా సరే..బుజ్జగించే ప్రయత్నాలు పెద్దగా చేయలేదు.

ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వదలడం…కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు కోమటిరెడ్డి బ్రదర్స్…అద్దంకికి వ్యతిరేకంగానే ఉన్నారు. ముఖ్యంగా అద్దంకి ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో…ఆయనకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి…డాక్టర్ రవిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాస్తవానికి తుంగతుర్తిలో అద్దంకి బాగా కష్టపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీలతో ఓడిపోయారు. ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు.

పైగా సర్వేల్లో కూడా తుంగతుర్తిలో అద్దంకికి ఈ సారి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తేలింది. ఇలాంటి పరిస్తితుల్లో తుంగతుర్తి టికెట్ రవికి ఇప్పిస్తానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. దీనిపై అద్దంకి గుర్రుగా ఉన్నారు. ఇక తాజాగా వెంకటరెడ్డి…అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో…మునుగోడు వేదికగా అద్దంకి…వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు…పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్లిపో అంటూ మాట్లాడారు. అంటే వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ ని వదిలేస్తే అద్దంకి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news