ఏలూరి ప్లానింగ్‌కు ఎప్పుడు తిరుగుండ‌దా… మ‌ళ్లీ స‌త్తా చాటాడుగా… !

ఏలూరి సాంబ‌శివ‌రావు. రాష్ట్ర రాజ‌కీయ‌ల్లో ఈయ‌నకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న దూకుడు.. ప్ర‌జ‌ల్లో ఉండ‌డం.. పార్టీని నిల‌బెట్ట‌డం, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడు, జ‌గ‌న్ హవా ఓ రేంజ్‌లో సాగినా కూడా.. ఏలూరి కీల‌క‌మైన ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. యువ ఎమ్మెల్యేగా. ప్ర‌జా నేత‌గా కూడా అనేక అవార్డులు పొందారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోనూ ఆయ‌న కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా నివ‌ర్ తుఫాను కార‌ణంగా దెబ్బ‌తిన్న రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో ప‌ర్య‌టించారు.

తొలుత గుంటూరులోని బాప‌ట్ల నుంచి ప్రారంభించిన నారా లోకేష్ ప‌ర్య‌ట‌న‌.. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా మండ‌లాల్లో కొన‌సాగింది. ప్ర‌స్తుతం బాప‌ట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఏలూరి సాంబ‌శివ‌రావు.. ఈ ప‌ర్య‌ట‌న‌ను ప్ర‌తి ష్టాత్మ‌కంగా భావించారు. లోకేష్ ప‌ర్య‌ట‌న‌కు ఆయ‌నే క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఆది నుంచి చివ‌రి వ‌ర‌కు లోకేష్ ప‌ర్య‌ట‌న‌ను ప్ర‌తిస్టాత్మ‌కంగా తీసుకున్న ఏలూరి.. దుమ్మురేపార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. లోకేష్ జిల్లాలో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి బైకులు, కార్లతో భారీ ఎత్తున ర్యాలీగా తీసుకువెళ్ల‌డంతోపాటు.. పెద్ద ఎత్తున యువ‌త‌ను స‌మీక‌రించి.. ఈ కార్య‌క్ర‌యం ఓ రేంజ్‌లో విజ‌య‌వంతం కావ‌డం ఇటు పార్టీ వ‌ర్గాల్లోనే కాకుండా అటు అధికార పార్టీ నేత‌ల్లోనూ చర్చ‌నీయాంశ‌మైంది.

గ‌తంలో ఒక‌సారి అకాల వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు .. నారా లోకేష్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా‌లో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో పార్టీ నాయ‌కుడు, పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల‌ రామానాయుడుతో క‌లిసి పొలం మ‌డుల్లోకి దిగి రైతును ప‌రామ‌ర్శించారు. వారి క‌ష్టాలు విన్నారు. వారిని న్యాయం చేస్తామ‌న్నారు. ఆ స‌మ‌యంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు క‌ద‌లి వ‌చ్చాయి. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత లోకేష్ చాలా చోట్ల ప‌ర్య‌టించినా నాడు పాల‌కొల్లు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన క్రేజ్ అధికార పార్టీలో క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణ‌మైంది.

మ‌ళ్లీ ఇప్పుడు గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల ప‌ర్య‌ట‌న కూడా అంతే చ‌ర్చ‌కు వ‌స్తోంది. తాజా ప‌ర్య‌ట‌న‌ను ఏలూరి సాంబ‌శివ‌రావు దిగ్విజ‌యం చేయ‌డంతో లోకేష్ స‌హా అందరూ హ్యాపీగా ఫీల‌య్యార‌ని టీడీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప్ర‌కాశం జిల్లాలో చీరాల‌, ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా ఈ ప‌ర్య‌ట‌న చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు కొన‌సాగింది. ఎక్క‌డిక‌క్క‌డ రైతులు రోడ్ల‌మీద‌కు స్వ‌చ్చందంగా వ‌చ్చి మ‌రీ లోకేష్‌కు త‌మ క‌ష్టాలు చెప్పుకున్నారు.

ప‌ర్య‌టనలో ఏలూరుతో పాటు న‌రేంద్ర‌వ‌ర్మ‌, ఎమ్మెల్యే ర‌వికుమార్‌, చివ‌ర్లో మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు తోడ‌య్యారు.అడుగడుగునా.. లోకేష్‌కు యువ‌త హార‌తులు ప‌ట్టారు.  జై లోకేష్‌, జైజై లోకేష్ నినాదాల‌తో రెండు జిల్లాలు మార్మోగిపోయాయి. ఈ మొత్తాన్ని భుజాన వేసుకుని న‌డిపించిన ఏలూరి సాంబ‌శివ‌రావు వ్యూహాం తిరుగులేకుండా స‌క్సెస్ అవ్వ‌గా ఆయ‌న ప్లానింగ్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.