యూపీ ఎన్నికలతో కేసీఆర్‌కు లింక్ ఏంటి? అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది?

-

తెలంగాణ రాజకీయాల్లో ఉన్న హీట్ ఇప్పుడు ఢిల్లీలో కూడా కొనసాగుతుంది. గత కొన్నిరోజుల నుంచి సి‌ఎం కే‌సి‌ఆర్, ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. వరుసపెట్టి కేంద్రంలోని పెద్దలని కలుస్తూ ఉన్నారు.  అయితే ఇంతవరకు ఎప్పుడు కే‌సి‌ఆర్ ఇంత సమయం ఢిల్లీలో గడపలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు ఇన్ని రోజులు మకాం వేసిన కే‌సి‌ఆర్…అధికారులని సైతం తెలంగాణకు పంపించేసారని తెలుస్తోంది. అలా అని ఒకరోజు కేంద్ర మంత్రులని కలుస్తుంటే, మరొకరోజు సైలెంట్‌గా ఉంటున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

దీంతో ఢిల్లీలో ఏం జరుగుతుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. కే‌సి‌ఆర్ ఢిల్లీలో ఉండటం వల్ల బి‌జే‌పి, టి‌ఆర్‌ఎస్‌లు ఒక్కటే అని ప్రచారం జరుగుతుంది. కానీ రాష్ట్రంలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో ఇలా, కేంద్రంలో మరొకలా బి‌జే‌పి ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య దోస్తీ ఉందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.

కే‌సి‌ఆర్-మోదీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. కే‌సి‌ఆర్, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్లారని టి‌ఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఏ సి‌ఎం అయినా ప్రధానిని కలవొచ్చు అని బి‌జే‌పి నేతలు మాట్లాడుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కే‌సి‌ఆర్…బి‌జే‌పితో దోస్తీ ఉందనే విధంగా క్రియేట్ చేసే అవకాశం ఉందని, కానీ ఆ విషయాన్ని ఎవరు నమ్మొద్దని బండి మాట్లాడుతున్నారు.

ఇదే సమయంలో త్వరలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల గురించి మోదీ-కే‌సి‌ఆర్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయని ప్రచారం వస్తుంది. ఎం‌ఐ‌ఎం యూపీ ఎన్నికల్లో దిగడానికి చూస్తుంది. మామూలుగా ఎం‌ఐ‌ఎం, బి‌జే‌పికి వ్యతిరేకంగానే ఫైట్ చేస్తున్నట్లు కనిపిస్తుందని, కానీ ఎం‌ఐ‌ఎం ఎక్కడకక్కడ పోటీ చేస్తూ, కాంగ్రెస్ ఓట్లని చీల్చి బి‌జే‌పికి బెనిఫిట్ అయ్యేలా చేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక ఎం‌ఐ‌ఎంతో దోస్తీ చేస్తున్న కే‌సి‌ఆర్, బి‌జే‌పితో చర్చలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికైతే కే‌సి‌ఆర్ ఢిల్లీ రాజకీయాల్లో బాగా హీట్ పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news