ఏపీ కేబినేట్ భేటీ…? మండలి రద్దుపై నిర్ణయం…?

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అమరావతి చుట్టూ కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఎం చెయ్యాలి అనే దానిపై తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే మండలి నాలుగు సార్లు వాయిదా పడటం, తమకు వ్యతిరేకంగా చైర్మన్ షరీఫ్ వ్యవహరించడంపై జగన్ ఆగ్రహంగా ఉన్నారు.

ఈ నేపధ్యంలో అసలు మండలినే రద్దు చేస్తే ఏ గొడవా ఉండదు అనే భావనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు శాసన మండలి రద్దుపై బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టె అవకాశాలు కనపడుతున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకునే౦దుకు గాని మంగళవారం రాత్రి మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మండలి రద్దు చేస్తే వికేంద్రీకరణ బిల్లుకి ఇబ్బంది ఉండదు అని జగన్ భావిస్తున్నారు. రూల్ 71 టీడీపీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలి రద్దు చెయ్యాలి అంటే పార్లమెంట్ ఉభయసభల ఆమోదం ఉండాలి. మండలి రాద్దుకి కేబినేట్ తీర్మానం సభలో 2/3 వంతు మద్దతు ఉండాలి. రాజ్య౦గ సవరణ కూడా చెయ్యాల్సి ఉంటుంది. ఉభయసభలు ఆమోదించే అవకాశాలు చాలా తక్కువ.

Read more RELATED
Recommended to you

Latest news