బ్రేకింగ్: ఏపీలో ఎన్నికలు జరగాల్సిందే: నిమ్మగడ్డ రమేష్ కీలక ప్రకటన

ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు రాజకీయ పక్షాలతో చర్చించి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందన్నారు. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని ఆయన క్లారిటీ ఇచ్చేసారు. ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని ఆయన చెప్పుకొచ్చారు.

కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753 కి తగ్గిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో జీహెచ్‍ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయన్న ఆయన… ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ పరమైన అవసరం అని స్పష్టం చేసారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదు అన్న ఆయన… నాలుగు వారల ముందు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలి అన్నారు.