వెస్ట్‌లో బాబు జోరు..వైసీపీ స్థానాలు టర్న్.!

-

అటు జగన్ గాని, ఇటు చంద్రబాబు గాని ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నట్లుగా ఇరువురు ప్రజల్లోకి వెళుతున్నారు..తమ పార్టీ నేతలని ప్రజల్లోకి పంపుతున్నారు. ఎవరికి వారు ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, తమ గొప్పాలని చెప్పుకోవడం చేస్తున్నారు. అయితే ఇరువురు నాయకులకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది. ఈ మధ్య జగన్‌కు..నర్సాపురం, నర్సన్నపేట, మందనపల్లే సభల్లో స్పందన బాగానే వచ్చింది.

అటు చంద్రబాబుకు..జగ్గయ్యపేట, చిలకలూరిపేట, కర్నూలుల్లో ప్రజల నుంచి మంచిగానే స్పందన వచ్చింది. దీంతో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో అర్ధం కాకుండా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాబు..ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలో కూడా బాబు పర్యటనకు మంచి స్పందన వస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో దెందులూరు, చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ ఐదు స్థానాల్లో ప్రజల నుంచి స్పందన వచ్చింది.

సాధారణంగా అధినేత వస్తుంటే..నేతలు కార్యకర్తలని తరలించడం చేస్తారు. అలాగే బాబు పర్యటనలకు పార్టీ శ్రేణులని తరలించారు. అదే సమయంలో అక్కడ ఉండే స్థానిక ప్రజలు కూడా బాబు పర్యటనల్లో కనిపిస్తున్నారు. దీంతో బాబుకు కాస్త మద్ధతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పైగా బాబు పర్యటించింది వైసీపీ సిట్టింగ్ స్థానాలు..ఆ స్థానాల్లో పర్యటించడం వల్ల టీడీపీకి కాస్త ఊపు వస్తుందని చెప్పవచ్చు.

కాకపోతే ఆ ఊపుని టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి అప్పుడే వైసీపీ స్థానాలు టీడీపీ వైపు టర్న్ అవుతాయి. ఇప్పుడున్న పరిస్తితుల్లో దెందులూరు, గోపాలపురం స్థానాల్లో టీడీపీకి మొగ్గు కనిపిస్తోంది. చింతలపూడిలో పర్లేదు..కానీ ఇక్కడ సరైన నాయకుడు లేరు. అటు కొవ్వూరు, పోలవరం స్థానాల్లో కూడా టీడీపీకి సరిన నాయకుడు లేరు. ఈ స్థానాల్లో టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఈ గ్రూపు తగాదాలు తగ్గితే టీడీపీకి ప్లస్ లేదంటే…వైసీపీకే ఎడ్జ్.

Read more RELATED
Recommended to you

Latest news