అవును చంద్రబాబు చివరి అస్త్రం ప్రయోగించనున్నారు..జగన్‌ని ఓడించడానికి బాబు తన చివరి అస్త్రాన్ని రెడీ చేస్తున్నారు. ఆ అస్త్రం సక్సెస్ అయితే..టీడీపీకి అధికారం ఖాయమనే అంటున్నారు. ఒకవేళ అది గాని ఫెయిల్ అయితే..మరో 20 ఏళ్ల పైనే జగన్‌కు తిరుగులేదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక బాబు వదిలే చివరి అస్త్రం ఏదో కాదు..ఆయన రాజకీయ జీవితమే..ఇక ఇవే ఆయనకు చివరి ఎన్నికలు అన్నట్లు పోరాడనున్నారు. ఇప్పటికే ఆయన వయసు 75కి దగ్గరవుతుంది.
ఇక ఇప్పుడు గాని ఓడిపోతే..మళ్ళీ ఆయనకు రాజకీయం చేసే వయసు ఉండదు. పూర్తిగా వయసు మీద పడుతుంది. పెద్దగా యాక్టివ్ గా ఉండలేరు. అందుకే ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు అన్నట్లు ఫైట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాబు చివరి ఛాన్స్ అని చెప్పి ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికీ ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఈ అంశాన్ని ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు..బాబుకు ఎంతవరకు మద్ధతు ఇస్తారనేది క్లారిటీ లేదు. ఎందుకంటే బాబుని సీఎంగా మూడుసార్లు చూశారు. నలభై ఏళ్లుగా ఆయన రాజకీయాలని చూస్తున్నారు. అలాంటప్పుడు మళ్ళీ చివరి ఛాన్స్ అనేది ఇస్తారనేది చెప్పలేం. కానీ ఆయనకు చివరి ఎన్నికలు అని కొందరు సెంటిమెంట్ గా అనుకుని టిడిపికి మద్ధతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అదే సమయంలో గత ఎన్నికల్లో జగన్‌ని గెలిపించడానికి కొన్ని కీలక హామీలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు బాబు సైతం ఊహించని హామీలతో ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలని ఆకట్టుకునేలా మేనిఫెస్టో సైతం రెడీ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ ఎన్నికల్లోనే బాబు చివరి అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇది ఫలిస్తే టిడిపికి అధికారం..విఫలమైతే ఇంకా జగన్‌కు ఎదురులేనట్లే.