మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్ధన్ రావు వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఇవాళ వైకాపాలో చేరారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్ష పార్టీ వైకాపాలో చేరేందుకు నేతలు తహ తహ లాడుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు కంపెనీలు చేపట్టిన సర్వేల్లో ఈసారి జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం.. వైకాపా భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తెలుస్తుండడంతోపాటు.. టీడీపీ ఆడుతున్న డ్రామాలు, నాటకాలతో విసుగెత్తిపోయిన సొంత పార్టీ నేతలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైకాపాలో చేరేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా వైసీపీలో ఇతర పార్టీలకు చెందిన నాయకుల చేరికలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరారు.
మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్ధన్ రావు వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఇవాళ వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా బాలవర్దన్ రావుకు జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బాలవర్దన్ రావు మాట్లాడుతూ… పేద ప్రజల కోసం జగన్ పడుతున్న తపనను చూసి వైసీపీలో చేరానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడడమే లక్ష్యమని తెలిపారు.
కాగా మరోవైపు వైసీపీలో రోజు రోజుకీ చేరికలు ఎక్కువవుతుండడంతో ఏపీలో అధికార టీడీపీ పార్టీకి ఈ విషయం మింగుడు పడడం లేదు. అసలే ఓ వైపు ఓటుకు నోటు కేసు, మరో వైపు డేటా చోరీ కేసులో సతమతం అవుతున్న టీడీపీ నేతలకు వైసీపీ ప్రభంజనం నిద్ర పట్టనీయడం లేదు. ఈ క్రమంలో ముందు ముందు టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతారో వేచి చూస్తే తెలుస్తుంది..!