ఈ సారి టిడిపి సిట్టింగ్ సీట్లని కూడా గెలుచుకుని 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే చాలావరకు టిడిపి కంచుకోటలని బద్దలుగొట్టారు. ఇప్పుడు మిగిలిన కోటలని కూడా బద్దలుగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చంద్రబాబు కంచుకోట కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టారు. అక్కడ భరత్‌ని అభ్యర్ధిగా పెట్టారు.
ఇక ఇప్పుడు టిడిపి కంచుకోట, బాలయ్య అడ్డా హిందూపురంపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ టిడిపి ఇంతవరకు ఓడిపోలేదు. 1983 నుంచి గెలుస్తూనే ఉంది. గత రెండు ఎన్నికల్లో బాలయ్య ఇక్కడ నుంచి గెలిచారు. రెండుసార్లు వైసీపీ అభ్యర్ధులని మార్చింది. ఆయన ప్రయోజనం లేదు. గత ఎన్నికల్లో ఇక్బాల్ ని దింపి..ముస్లిం ఓట్లతో గెలవాలని చూశారు..కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఇక్బాల్ ని సైడ్ చేసి మహిళా సెంటిమెంట్ తో వచ్చారు. వైసీపీ నాయకురాలు దీపికని హిందూపురం ఇంచార్జ్ గా ప్రకటించారు.
రానున్న ఎన్నికల్లో ఆమె బాలయ్యపై పోటీ చేయనున్నారు. మరి దీపిక బాలయ్యకు చెక్ పెట్టగలరా? అంటే కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఎలాగో హిందూపురం టిడిపి కోట..పైగా బాలయ్యకు వన్ సైడ్ ఓటింగ్ ఉంది. అధికారంలో లేకపోయిన సొంత డబ్బులతో పనులు చేస్తున్నారు. దీంతో అక్కడ ప్రజా మద్ధతు బాలయ్యకే ఉంది.
హిందూపురంలో బీసీ, ముస్లిం ఓట్లు ఎక్కువ. ఆ రెండు వర్గాలు బాలయ్యకు మెజారిటీగా మద్ధతు ఇస్తారు. గత ఎన్నికల్లో వైసీపీ ముస్లిం ఫార్ములాతో ఫెయిల్ అయింది. ఇప్పుడు బీసీ మహిళా ఫార్ములాతో వస్తుంది. మరి ఈ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. బాలయ్యని ఎంతవరకు నిలువరించగలరో చూడాలి.