బావాబామ్మర్దుల పోరు..ప్రకాశంలో ‘ఫ్యాన్’ విలవిల..!

-

అసలే అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి..అటు కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని స్వయంగా సీఎం జగనే చెబుతున్నారు. ఇక వీటి అన్నిటికి తోడు పెద్ద నేతల మధ్య ఆధిపత్య పోరు ఇంకా పార్టీకి నష్టం చేకూరుస్తుంది. పైన చెప్పిన పరిస్తితులు అన్నీ జిల్లాల్లోనూ ఉన్నాయి..కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరింత ఎక్కువగా ఉన్నాయని అర్ధమవుతుంది.

ఇక్కడ టీడీపీకి మంచి పట్టు ఉంది..గత ఎన్నికల్లో నాలుగు సీట్లలో టీడీపీ గెలిచింది..ఇక వైసీపీ 8 సీట్లలో గెలిచింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్ళు దాటేసింది. ఇప్పుడు అక్కడ పరిస్తితులని చూస్తుంటే కాస్త వైసీపీకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పొచ్చు. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంటే..టీడీపీ బలం పెరుగుతుంది..ఇంకా చెప్పాలంటే వైసీపీని దాటేసి టీడీపీ ఆధిక్యంలోకి వస్తుందని పలు సర్వేల్లో తేలుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఇంకా కష్టపడాలి. పైగా టీడీపీతో జనసేన కలిసే ఛాన్స్ ఉంది..అప్పుడు వైసీపీకి ఇంకా రిస్క్.

అయితే ఆ రిస్క్‌ని అంతర్గత పోరుతో ఇంకా పెంచుతున్నారే తప్ప తగ్గించడం లేదు. ముఖ్యంగా బావాబామ్మర్దులైన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతుందట. జిల్లాలో పరిస్తితి ఎలా ఉందంటే..ప్రతి నియోజకవర్గంలో వైవీ, బాలినేని వర్గాలు అంటూ రెండు వర్గాలు ఉంటున్నాయి. పదవుల విషయంలో పోస్టులు, పోలీసుల ట్రాన్స్‌ఫర్ల విషయంలో వీరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయిలోనే జరుగుతుంది.

ఇక తాజాగా ఒంగోలులో బాలినేని..స్థానిక టీటీడీ కళ్యాణమండపంలో శ్రీనివాస కళ్యాణం జరిపించారు. మొదట దీనికి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ నుంచి పర్మిషన్ రాలేదు..తర్వాత బాలినేని జగన్ దగ్గరకు వెళ్ళడంతో పర్మిషన్ వచ్చింది. ఇక స్వయంగా బామ్మర్ది టీటీడీ మండపంలో కళ్యాణం జరిపించినా సుబ్బారెడ్డి హాజరు కాలేదు. దీని బట్టి చూస్తే వారి మధ్య పోరు ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎన్నికల సమయంలో టికెట్ల విషయంలో రెండు వర్గాల మధ్య రచ్చ జరిగేలా ఉంది..ఒకరికి సీటు ఇస్తే మరొక వర్గం సహకరించడం కష్టమే..దీని వల్ల ప్రకాశంలో వైసీపీకి డ్యామేజ్ తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news