భూమా-పరిటాల ఫ్యామిలీలకు లక్ తక్కువే!

-

ఏపీ రాజకీయాల్లో పరిటాల, భూమా ఫ్యామిలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. రాయలసీమకు చెందిన ఈ ఫ్యామిలీలకు రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. పరిటాల ఫ్యామిలీకి అనంతపురంలో, భూమా ఫ్యామిలీకి కర్నూలు జిల్లాలో పట్టు ఉంది. ఈ రెండు ఫ్యామిలీలు టీడీపీలో బలమైన ఫ్యామిలీలుగా ఉన్నాయి. ఇలా బలమైన ఫ్యామిలీలుగా ఉన్న పరిటాల, భూమా ఫ్యామిలీలకు ఇప్పుడు రాజకీయంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత ఎన్నికల్లోనే రెండు ఫ్యామిలీలు దారుణంగా ఓడిపోయాయి.

 

అయితే వచ్చే ఎన్నికల్లో కూడా వీరికి గెలుపు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తాజా సర్వేల్లో తేలింది. గత ఎన్నికల్లో పరిటాల వారసుడుగా శ్రీరామ్…రాప్తాడులో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికల్లో అక్కడ గెలిచి తీరాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పరిటాల ఫ్యామిలీ చేతికి ధర్మవరం సీటు కూడా వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో ధర్మవరంలో శ్రీరామ్, రాప్తాడులో సునీతమ్మ పోటీకి దిగుతారు.

అయితే ఈ రెండు చోట్ల పరిటాల ఫ్యామిలీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాప్తాడులో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారని సర్వేలో తేలింది. వీరిని ఓడించడం పరిటాల ఫ్యామిలీకి కష్టమే అంటున్నారు. అటు కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి సేమ్ సమస్య. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

ఇప్పటికీ ఆ రెండు చోట్ల భూమా ఫ్యామిలీ పికప్ అవ్వలేదని తెలుస్తోంది. ఆళ్లగడ్డలో బిజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాలలో శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారని సర్వేలో తేలింది. రాప్తాడు, ధర్మవరం, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటంతో భూమా, పరిటాల ఫ్యామిలీలకు ఈ సారి కూడా గెలిచే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news