ఓ వైపు దూకుడుగా రాజకీయ యుద్ధం చేస్తూనే..మరో వైపు సైలెంట్ గా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా కమలం వెళుతున్నట్లు కనిపిస్తోంది..పనిలో పనిగా కాంగ్రెస్ కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళుతుంది. రాష్ట్రంలో బీజేపీ ఏ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుందో తెలిసిందే…కేసీఆర్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగుతూనే…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. అదే సమయంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంది.
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు….కానీ నాణేనికి మరోవైపు కమలం ఊహించని వ్యుహలతో రాజకీయం చేస్తుంది. రాజకీయాల్లో సీక్రెట్ వ్యూహాలు ఉండాలనే ఫార్ములాని గట్టిగానే ఫాలో అవుతుంది…సీక్రెట్ గా టీఆర్ఎస్ ని దెబ్బకొట్టడంతో పాటు…కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా బీజేపీ పనిచేస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి ఎప్పటికప్పుడు కొత్త వ్యుహలతో ముందుకొస్తూనే ఉంది.
ఇదే క్రమంలో టీఆర్ఎస్ లో ఉన్న బలమైన నేతలని లాగేసే విషయంలో కమలం పార్టీ చాలా సీక్రెట్ గా ఆపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ ని సైతం ఇంకా వీక్ చేయడానికి చూస్తుంది. అసలు ఎప్పుడో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్దిని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి తీసుకురావాలి…కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించి..ఇప్పుడు సరైన సమయం అని భావించి…కోమటిరెడ్డిని బీజేపీలోకి తీసుకొస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి..ఉపఎన్నిక బరిలో మరోసారి సత్తా చాటాలని చూస్తుంది.
అలాగే కోమటిరెడ్డి బాటలో మరికొందరు ఎమ్మెల్యేలని సైతం లాగడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీ అధిష్టానం ఇప్పటికే టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్…టీఆర్ఎస్ లో కట్టప్పలు ఎక్కువ ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే…దానికి అర్ధం టీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావడానికి సిద్ధమయ్యారని హింట్ ఇచ్చారని తెలుస్తోంది. కాకపోతే పదవికి రాజీనామా చేసే విషయంలో వారు ఆలోచనలో ఉన్నారని సమాచారం…అదే ఎన్నికల ముందు అయితే బీజేపీలోకి రావడానికి రెడీ అని తెలుస్తోంది..మొత్తానికైతే కారు పార్టీని కమలం సైలెంట్ గా దెబ్బకొట్టేలా ఉంది.