ఆ టార్గెట్‌లో కమలం ఫెయిల్..గులాబీ-హస్తంపై తేలిపోతుందా?

-

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బి‌జే‌పి పనిచేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని గద్దె దించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళుతుంది.. బి‌జే‌పి బలోపేతానికి అటు కేంద్రం పెద్దలు, ఇటు రాష్ట్ర నేతలు కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ బలోపేతానికి బి‌జే‌పి స్ట్రీట్ కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి దూసుకెళుతుంది.

అయితే పార్టీ బలోపేతానికి బి‌జే‌పి ఇంకో టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అది ఏంటంటే..తెలంగాణలో 35 వేల బూత్ కమిటీలని ఏర్పాటు చేయాలని కేంద్రం పెద్దలు టార్గెట్ గా పెట్టారు. కానీ ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వడంలో తెలంగాణ బి‌జే‌పి నేతలు విఫలమవుతున్నారు. ఇప్పటివరకు 10 వేల బూత్ కమిటీలు మాత్రమే పూర్తి అయినట్లు తెలిసింది. అంటే 30 శాతం వరకు మాత్రమే పనిచేశారు. దీంతో కేంద్రం పెద్దలు సీరియస్ గా ఉన్నారని తెలిసింది. ఎలాగైనా బూత్ కమిటీలని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టారు.

అయితే బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే బూత్ కమిటీలు బి‌జే‌పికి బలం లేదు. క్షేత్ర స్థాయిలో కమిటీలు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ లకు బలంగా ఉన్నాయి. ఈ విషయంలో ఆ రెండు పార్టీలతో పోలిస్తే బి‌జే‌పి వెనుకబడి ఉందనే చెప్పాలి. ఇక అందుకే వాటిని మరింత బలోపేతం చేసేందుకు బి‌జే‌పి కీలక నేతలు సిద్ధమవుతున్నారు.

ఇప్పుడు బి‌జే‌పి రాష్ట్ర నేతలు ఈ బూత్ కమిటీలని పూర్తి చేసే పనిలో ఉంది. ఎన్నికలు మరో 8 నెలల్లో జరగనున్నాయి. కాబట్టి త్వరగా ఈ బూత్ కమిటీలని పూర్తి చేసి రేసులో నిలబడాలి.

Read more RELATED
Recommended to you

Latest news