రూట్ మార్చిన బిజేపీ మాజీ ఛీప్.. ఆయన సూపరంటూ కితాబు..

-

భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు అంటే గిట్టని వారు చాలామంది ఉన్నారు.. ఆయనతో పొత్తు ఉందని.. అధిష్టానానికి చెప్పిన నేతలూ ఉన్నారు.. కానీ కేంద్రంలోని కమలనాథులు మాత్రం ఏపీలో టీడీపీతో మరోసారి పొత్తు పెట్టుకున్నారు.. అధికారంలోకి వచ్చారు. ఇదంతా పక్కన పెడితే.. నిన్నమొన్నటి వరకు చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శలు చేసిన ఓ నేత ఇప్పుడు రూట్ మార్చారు.. బాబు సూపర్ అయ్యా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.. దీంతో ఆయన రూట్ మార్చనడానికి కారణాలేంటనే చర్చ ఏపీ బిజేపీలో జరుగుతోంది..

ఏపీ బిజేపీలోని ఓ వర్గం నేతలు సీఎం చంద్రబాబునాయుడుకు దగ్గరయ్యారు.. ఆయన ద్వారా ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు దక్కించుకున్నారు.. నామినెటెడ్ పదవుల రేసులో కూడా ఉన్నారు..ఈ విషయంలో ఏపీ బిజేపీ మాజీ ఛీప్ సోము వీర్రాజు వెనుకబడిపోయారు.. బిజేపీ ఛీప్ గా ఉన్నసమయంలో చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి మ్యూట్ లోకి వెళ్లిపోయారు. సమయం చూసుకుని మళ్లీ సోము తెరమీదకు వచ్చారు.

కేంద్రంలో ఏం పని కావాలన్నా.. రాష్టంలో పదవులు ఇవ్వాలన్నా.. చంద్రబాబు సాయం అవసరం..ఇది గ్రహించిన సోము వీర్రాజు సడన్ గా రూట్ మార్చారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.. నామినెటెడ్ పదవుల భర్తీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఆయన్ని పొగుడుతున్నారని సోము వ్యతిరేక శిభిరం ప్రచారం చేస్తోంది.. అచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు స్పందన బాగుందని ఆయన కితాబివ్వడం ఇప్పుడు రెండుపార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది.. చంద్రబాబు ఆయన విషయంలో సానుకూలంగా స్పందిస్తారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version