రెండు పువ్వులు: బాబు-జగన్ కోసం పోటీ…?

-

ఏపీలో బీజేపీ పుంజుకుందా? తెలంగాణలో మాదిరిగా….అధికార పార్టీకి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందా? అసలు అధికారం దక్కించుకునే దిశగా వెళుతుందా? అంటే అబ్బే లేదనే చెప్పాలి…పుంజుకోవడం మాట దేవుడు ఎరుగు…ముందు గత ఎన్నికల్లో వచ్చిన ఒక్క శాతం ఓటు బ్యాంకుని దాటేలా కనిపించడం లేదు…ఇంకా ఏపీ ప్రజలు…బీజేపీ వైపు వచ్చేలా కనిపించడం లేదు..కేంద్రంలో అధికారంలో ఉండి కూడా…విభజన వల్ల నష్టపోయిన తమని ఆదుకోవడం లేదనే కోపం ఏపీ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

 

ఆదుకోకపోవడం కాకుండా…రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నట్లు కనిపిస్తోంది…అందుకే బీజేపీని ఏపీ ప్రజలు ఇంకా నమ్మే పరిస్తితుల్లో లేరు…ఇంకా ఆ పార్టీ బలం కూడా పెరగడం లేదు..అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్…అందుకే బీజేపీ సపోర్ట్ ఉంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని అటు జగన్ గాని, ఇటు చంద్రబాబు గాని భావిస్తున్నారు…అందుకే పరోక్షంగా బీజేపీ సపోర్ట్ కోసం ట్రై చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అంటే కేంద్రం సపోర్ట్ దొరికితే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

అయితే బీజేపీ సైతం ఒకోసారి ఒకోలా రాజకీయం చేస్తూ ముందుకెళుతుంది…పూర్తిగా జగన్ కు అండగా ఉన్నట్లు కనిపించడం లేదు…అలా అని బాబుకు మద్ధతుగా ఉన్నట్లు లేదు. కాకపోతే ఏపీలోని బీజేపీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనిపిస్తున్నారు…ఒక గ్రూపు ఏమో జగన్ కు అనుకూలంగా, బాబుకు వ్యతిరేకంగా…మరో గ్రూపు ఏమో బాబుకు అనుకూలంగా..జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

జగన్ కు అనుకూలంగా ఉన్నవారు…అసలు టీడీపీతో పొత్తు వద్దంటే వద్దు అంటున్నారు…అలాగే పవన్ కల్యాణ్ ని కూడా టీడీపీకి దూరం చేసి…ఓట్లు చీల్చి..పరోక్షంగా జగన్ కు లాభం వచ్చేలా చేయాలని చూస్తున్నారు. ఇక బాబుకు అనుకూలంగా ఉండేవారు…ఎలాగైనా కేంద్ర పెద్దలని ఒప్పించి…పవన్ తో పాటు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. జగన్ ని గద్దె దించేయాలని అనుకుంటున్నారు. అంటే ఏపీలో రెండు కమలం పువ్వులు అయిపోయాయని చెప్పొచ్చు..మరి చూడాలి చివరికి కమలం పార్టీ…ఎవరికి సపోర్ట్ ఇస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news