టార్గెట్ 34: జీరోతో కమలం స్టార్ట్!

-

పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు చూసుకుంటే తెలంగాణలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదనే సంగతి తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకుని, 105 సీట్లలో డిపాజిట్ కోల్పోయిందంటే బీజేపీ బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు…కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లని గెలుచుకుని సత్తా చాటింది..అక్కడ నుంచి బీజేపీ బలం పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గడం లేదు..ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని బీజేపీ చూస్తుంది.

అయితే బీజేపీకి అధికారం దక్కడం అంత సులువు కాదు…బలమైన టీఆర్ఎస్ ని ఢీకొట్టడం..అలాగే బలపడుతున్న కాంగ్రెస్ ని దాటి సత్తా చాటడం ఈజీ కాదు. కానీ రెండు పార్టీలని దాటుకుని అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా కష్టపడుతుంది. బలహీనంగా ఉన్న స్థానాల్లో బలం పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అయితే ఈ మధ్య వచ్చిన సర్వేల్లో బీజేపీ బలం పెరుగుతుందని తెలుస్తోంది. కానీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీజేపీకి ఏ మాత్రం బలం లేదని తెల్సింది. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్నాయి.

అందుకే ఈ మూడు జిల్లాల్లో బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది…నల్గొండలో 12 స్థానాలు, వరంగల్ లో 12, ఖమ్మంలో 10 స్థానాలు…మొత్తం కలిపి 34 స్థానాలు ఉన్నాయి…అయితే 34 స్థానాల్లో బీజేపీ బలం అంతంత మాత్రమే. అంటే మూడు జిల్లాల్లో బీజేపీ బలం జీరో. ఇప్పుడు జీరో నుంచి బీజేపీ మొదలవుతుంది. ఇక జీరోని ఒకటి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి తీసుకోస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మునుగోడు ఉపఎన్నికలో సత్తా చాటాలని చూస్తుంది. మునుగోడులో గాని గెలిస్తే నిదానంగా బీజేపీకి సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. లేదంటే బీజేపీ…ఈ మూడు జిల్లాల్లో సత్తా చాటడం చాలా కష్టం. చూడాలి మరి టార్గెట్ 34లో ఎంతవరకు రీచ్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news