బీఆర్ఎస్ పవర్‌లో ఉన్నప్పుడు ఆయనతో అత్యంత చనువుగా ఉన్న నేతలే కావడం గమనార్హం. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి పార్టీ తరపున కొన్నాళ్ల క్రితం బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన రాకేశ్‌రెడ్డిని కేటీఆర్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఆర్ఎస్ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు. ఆ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ చెప్పిందే వేదం. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ అంతా తానై చక్రం తిప్పేవారు. ఎమ్మెల్యేలు,ఎంపీలు,కీలక నాయకులు అంతా కూడా పార్టీ అధినాయకత్వం చెప్పినట్లే నడుచుకునేవారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అధిష్టానం లైన్ దాటేవారు కాదు. హైకమాండ్ ఏ అభ్యర్థిని ఎంపిక చేసినా..క్షేత్ర స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి కట్టుగా వారి గెలుపు కోసం పనిచేసేవారు. ఇక ఎక్కడైనా ఎవరైనా పార్టీ లైన్ దాటి పనిచేసినట్లు అనిపిస్తే అధినాయకత్వం కూడా వెంటనే చర్యలు తీసుకునేది.
కానీ..ఇదంతా గతం.. ఇప్పుడు ఆ పార్టీలో క్రమ శిక్షణ మెల్లగా కట్టుతప్పుతున్నట్లే కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధినాయకత్వం ఆదేశాలను కూడా కొన్నిసార్లు ఖాతర్ చేయని పరిస్థితులు నెలకొన్నాయి. అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను పట్టించుకోవట్లేదంటా..! అందులోనూ బీఆర్ఎస్ పవర్‌లో ఉన్నప్పుడు ఆయనతో అత్యంత చనువుగా ఉన్న నేతలే కావడం గమనార్హం. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి పార్టీ తరపున కొన్నాళ్ల క్రితం బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన రాకేశ్‌రెడ్డిని కేటీఆర్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాకేశ్ రెడ్డి గెలుపుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ఎక్కడ మీటింగ్స్ జరిగినా..పార్టీ తరపున పార్టీలోని ముఖ్యనేతలకు ఆహ్వానాలు పంపుతున్నారు.
అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. దీనికి పార్టీ అధిష్టానం నుంచి సుమారు 130 మంది నేతలకు ఆహ్వానాలను పంపించారు. ఆహ్వానాలు అందుకున్న ముఖ్య నాయకులు అందరూ వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలుపు విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు,సూచనలు ఇవ్వాలని పార్టీ అధిష్టానం కోరింది. అయితే ఇంత కీలకమైన మీటింగ్‌కు పార్టీ సీనియర్ నేతల నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడం అధినాయకత్వాన్ని విస్మయానికి గురిచేసినట్లైంది.
అంతేకాక బీజేపీ నుంచి వచ్చిన రాకేశ్‌రెడ్డికి పార్టీ తరపున టికెట్ ఇవ్వడం తమకు ఇష్టం లేదని.. తాము ఆయనకు అస్సలు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. దీంతో సన్నాహాక సమావేశానికి పార్టీ కీలక నాయకులు వచ్చి రాకేశ్‌రెడ్డికి మద్దతు పలుకుతారనుకుంటే..కేవలం 30 మందే రావడంతో..ఆయన విస్తుపోయారు. ఈనేపథ్యంలోనే అడపాదడపా కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ మొత్తం తంతును చూసిన వారు మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీయేనా..? అనే అనుమానం వ్యక్తం చేశారు. క్రమ శిక్షణకు మారుపేరైనా బీఆర్ఎస్ ఇలా తయారైందేందంటూ ముక్కున వేలేసుకున్నారు.