బెజవాడ రాజకీయం..బుద్దా తెలివి..కేశినేనికి సైలెంట్‌గా చెక్.!

-

బెజవాడ రాజకీయం గత కొన్ని రోజులుగా హాట్ హాట్ గా సాగుతున్న విషయం తెలిసిందే. వేసవి వేడిని తలపించేలా తెలుగుదేశం పార్టీలో రాజకీయ పోరు జరుగుతుంది. అక్కడ చాలా రోజుల నుంచి ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన సొంత పార్టీపైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో తనకు పార్టీ టికెట్ ఇవ్వకుండా..ఏ పిట్టల దొరకు ఇచ్చిన తనకు అభ్యంతరం లేదని, ప్రజలు కోరుకుంటే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తానని అన్నారు.

అలాగే ఇంచార్జ్‌లు అంటే తన దృష్టిలో గొట్టం గాళ్ళు అనే వారు ఏమి రాజ్యాంగబద్ధ పదవి లో లేరని ఫైర్ అయ్యారు. ప్రత్యేకంగా విజయవాడలో బోండా ఉమా, బుద్దా వెంకన్న టార్గెట్ గా నాని ఫైర్ అయ్యారు. అయితే వీరి మధ్య ఎప్పటినుంచో రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాకపోతే వారు సైలెంట్ గానే ఉంటూ..కేశినేనికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇటు కేశినేని మాత్రం పదే పదే మీడియా ముందుకొచ్చి సొంత పార్టీపైనే ఫైర్ అవుతున్నారు. ఈ అంశం టి‌డి‌పికి ఇబ్బందిగా మారింది.

అయితే తాజాగా కేశినేని నాని..బోండా, బుద్దాలని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే బుద్దా వెంకన్న స్పందిస్తూ.. కేశినేని నాని తనని ఎన్ని బూతులు తిట్టినా భరిస్తానని, తనని ఎవరేం విమర్శించినా తొందరపడనని, చంద్రబాబుకు మాటిచ్చా కాబట్టే కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేం స్పందించనని, తన స్పందన వల్ల పార్టీకి నష్టం చేకూర్చకూడదనే తాను మాట్లాడడం లేదని అన్నారు.

కేశినేని నాని వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని, బీసీ నాయకుడి అయిన తనని కేశినేని నాని ఎన్నోసార్లు అవమానించారని, ఇప్పటికీ నాని గారంటూనే సంబోధిస్తాన,  నాని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని.. నానికి తనకు భేదాభిప్రాయాలు వచ్చి విడిగా ఉంటున్నామని,  గతంలో కేశినేని నానిపై తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటే.. ఈ విషయాన్ని గతంలోనే ఒప్పుకున్నానని, కేశినేని నానిని ఆ స్థాయిలో విమర్శించడంపై చంద్రబాబు తనపై అప్పట్లో కొప్పడ్డారన్నారని చెప్పుకొచ్చారు.

అయితే బుద్దా ఇలా కేశినేనిపై విమర్శలు చేయకుండా తెలివిగా టి‌డి‌పి అధిష్టానానికి వదిలేశారు. అంటే తాను ఏమి అనడం లేదు..కానీ కేశినేని మాత్రం తిడుతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన్ని పార్టీ నుంచి సైలెంట్ గా చెక్ పెట్టడానికి బుద్దా అండ్ టీం ట్రై చేస్తుందని చెప్పవచ్చు. మరి కేశినేని వ్యవహారం బాబు ఎలా తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news