టీడీపీలోకి బైరెడ్డి సిద్ధార్థ్..తప్పు లేదుగా..!

-

ఏపీ రాజకీయాల్లో బాగా క్రేజ్ ఉన్న యువ నేతల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరని చెప్పొచ్చు..అన్నీ పార్టీల్లో ఉన్న యువ నేతల్లో బైరెడ్డి టాప్‌లోనే ఉంటారు. తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కొందరు సీనియర్ నేతలకు లేని ఫాలోయింగ్ బైరెడ్డికి ఉంది. అయితే జగన్‌కు వీర విధేయుడుగా ఉంటున్న బైరెడ్డి టీడీపీలో చేరబోతున్నారని ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే ఆ కథనాలని బైరెడ్డి తీవ్రంగా ఖండించారు..తాజాగా ఓ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ..ఇటీవల టీడీపీలో చేరుతున్న అనే వార్తల్లో నిజం లేదని చెప్పారు.

కానీ నాలుగైదు ఏళ్ల క్రితం మాత్రం టీడీపీలో చేరాలని ప్రయత్నించానని, కానీ కుదరలేదని, చేరలేదని చెప్పారు. అయితే అలా పార్టీలో చేరాలనుకోవడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. అలాగే ఓ పార్టీలో చేరాలనుకోవడం కోసం ఎవరో కాళ్ళు పట్టుకున్నానని క్రియేట్ చేశారని, అలా అంటే 2009, 2014 ఎన్నికల్లో కడప అసెంబ్లీకి పోటీ చేయాలని తన తల్లి వద్దకు చంద్రబాబు మనషులని పంపించారు..ఆ విషయం చంద్రబాబేనే అడగాలని చెప్పారు.

అయితే ఇటీవల తాను టీడీపీలో చేరుతున్నానని,లోకేష్‌తో భేటీ అయ్యానని ప్రచారం చేస్తున్నారు…తాను వైసీపీనీ వీడేది లేదని, తాను ఎప్పటికీ జగన్ విధేయుడునే అని చెప్పుకొచ్చారు. మొత్తానికి బైరెడ్డి అయితే టీడీపీలో చేరాలని గతంలో ట్రై చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం వైసీపీని వీడటం కష్టం..వైసీపీలో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో సిద్ధార్థ్‌కు సీటు ఇవ్వాలనే డిమాండ్ కూడా యువ నాయకత్వంలో పెరుగుతుంది. కానీ సీటు ఇవ్వడానికి కర్నూలులో ఏ సీటు ఖాళీ లేదు. సీనియర్లని తప్పించి సిద్ధార్థ్‌కు సీటు ఇస్తారనేది డౌటే. మరి ఎవరినైనా తప్పించి సిద్ధార్థ్‌కు సీటు ఇస్తారా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news