ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు సిద్ధం అవుతుంది. ఈ సారి కేబినెట్ విస్తరణలో పలువురు మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగ ఈ కేబినెట్ విస్తరణకు ముందు.. ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న వారిలో కొందరు మంత్రి పదువులను కోల్పోనున్నారు. దీంతో మంత్రి పదువులు కోల్పోయే వారిని ఈ నెల 27 లోపు రాజీనామా చేయాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది.
కాగ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో పలువురిని కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. అందులో పెద్ది రెడ్డి, కొడాలి నాని తో పాటు పేర్ని నాని ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బుగ్గన, బాలినేనిలో కూడా ఒకరికి అవకాశం ఇచ్చేందుకు జగన్ సుముఖుంగా ఉన్నట్టు తెలుస్తుంది. కొత్త కేబినెట్ లో హోం మంత్రి పదవి మరోసారి మహిళకే ఇస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ సారి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
అలాగే 50 శాతం మంత్రి పదవులను బీసీలకే ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని సమాచారం. అలాగే 33 శాతం మంత్రి పదువులు మహిళలకే కేటాయిస్తారని తెలుస్తుంది. ప్రతి జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. కాగ కొత్త మంత్రులు ఉగాది రోజు బాధ్యతలు తీసుకుంటారని సమాచారం.