క్యాపిటల్ వార్..సీమ నేతలు ఎంట్రీ?

-

ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే..ఎప్పుడైతే అమరావతిని కాదని జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారో అప్పటినుంచి ఏపీకి కంటూ ఒక రాజధాని లేకుండా పోయింది..అలాగే రాజధాని అంశంపై రాజకీయంగా రగడ నడుస్తోంది..వైసీపీ ఏమో మూడు రాజధానులు అని, టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు అమరావతి ఒకటే రాజధాని అంటున్నారు.

అయితే మూడు రాజధానుల విషయంలో కోర్టు..జగన్ ప్రభుత్వానికి షాకులు ఇస్తూ వచ్చింది. దీంతో మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. ఇక అనూహ్యంగా అమరావతి రైతులు పాదయాత్ర మొదలుపెట్టడంతో వైసీపీ నేతలు రాజధాని అంశంపై అమరావతి, టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర జరుగుతుంది. ఇక దీన్ని ఉత్తరాంధ్రలోకి రాగానే..ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని అక్కడ మంత్రులు అంటున్నారు.

అలాగే విశాఖని రాజధాని కాకుండా అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదని..మూడు రాజధానులు కావాలని చెప్పి..వైసీపీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుని..అమరావతి రైతుల పాదయాత్రకు ఎలా అడ్డుకట్ట వేయాలి..విశాఖని ఎగ్జుక్యూటివ్ క్యాపిటల్ చేయాలనే డిమాండ్‌తో ప్రజల్లోకి వెళ్లడానికి చూస్తున్నారు. ఇప్పటికే విశాఖలో పలుమార్లు సమావేశం నిర్వహించుకున్న వైసీపీ నేతలు..తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో అమరావతి రైతులు, టీడీపీపై విమర్శలు చేయడం..విశాఖని రాజధాని చేయాలనే డిమాండ్‌తో ముందుకెళుతున్నారు.

అలాగే తూర్పు గోదావరి జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర ఎంట్రీ ఇస్తే..అక్కడే అడ్డుకోవాలని..అలాగే విశాఖ రాజధాని కోసం తాము అన్నవరం టూ తిరుపతి పాదయాత్ర చేస్తామని ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే రాయలసీమకు చెందిన వైసీపీ నేతలు..కర్నూలుకు న్యాయ రాజధానికి సంబంధించి పెద్దగా స్పందించడం లేదు. పోరాటాలు చేయడం లేదు. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర వైపే వస్తుండటంతో…ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు..మూడు రాజధానుల కోసం పోరాటం మొదలుపెట్టారు. మరి చూడాలి ఈ రాజధాని రచ్చ ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news