‘పోలీసులు, ఆ పార్టీ నాయకులు కుమ్మకై నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారు’

Join Our Community
follow manalokam on social media

పురపాలక ఎన్నికల్లో పోలీసులు, అధికారులు, వైఎస్సార్‌ నాయకులు కుమ్మకై ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నేమినేషన్లను బెదిరించి బలవంతంగా ఉపసంహరించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, ఈ విషయమై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ లేఖలో ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆయా ఎన్నికల కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు, పోలీసులను వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుకొని తెలుగుదేశం అభ్యర్థుల నాటిస్తూ రిటర్నింగ్‌ అధికారులతో నకిలీ ఉపసంహరణ పత్రాలు అందజేశారని ఆరోపించారు.

సమయం మించిపోయినా..

నిర్ణిత సమయం మించిపోయిన కూడా నామినేషన్ల ఉపసంహరణ కొనసాగాయని, ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం నిజనిజాలు తెలుసుకున్న తర్వాతే చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయాలనే ఎస్‌ఈసీ ఆదేశాలను నాయకులు గానీ, ఎన్నికల అధికారులు గానీ.. పట్టించుకోవలేదని ఆక్షేపించారు. దౌర్జన్యాలను నివారించాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడితే సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని ఆరపించారు. పురపాలక ఎన్నికల్లో ఫోర్జరీ సంతాలకు పాల్పడిని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఎస్‌ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...