హామీ మాఫీ: చంద్రబాబు నుంచి మరో “మాఫీ” హామీ!

-

ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో చంద్రబాబుకు పాస్ మార్కులు కూడా రావనేది రాజకీయాల్లో ఒక నానుడి! ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చే హామీలకు, అధికారంలోకి వచ్చాక ఆ హామీల వెనక ఉన్న “కండిషన్స్ అప్లై” అనే చేష్టలకు తేడా ఏపీ వాసులకు బాగా తెలుసు. అయితే ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మరో “మాఫీ” చేస్తామని ప్రకటిస్తున్నారు చంద్రబాబు. అదే… గృహ రుణాలు మాఫీ!

chandrababu naidu

విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క రైతూ తాను తీసుకున్న రుణాలను చెల్లించవద్దని.. అధికారంలోకి రాగానే వాటిని మొత్తంగా మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తూ… పెద్ద హామీ ఇచ్చారు. దీంతో రైతులు పాత రుణాల చెల్లింపును వాయిదా వేయడమే కాకుండా బంగారం తాకట్టు పెట్టి కొత్తరుణాలు తీసుకున్నారు. అయితే కుర్చీ ఎక్కిన అనంతరం… రుణమాఫీని రూ.1,50,000లకే పరిమితం చేసి రైతులకు షాకిచ్చారు చంద్రబాబు!

ఇచ్చిన హామీలపై చంద్రబాబు టెరంస్ & కండిషన్స్ ఆ రేంజ్ లో ఉంటాయి. ఇది ఏపీ వాసులకు అలవాటైన ప్రక్రియ. అయితే… ప్రస్తుతం ఏపీలో టీడీపీ నిలబడుతుందా లేదా అనే సందిగ్ధం కార్యకర్తల్లో కూడా నెలకొన్న పరిస్థితుల్లో… టీడీపీ అధికారంలోకి వచ్చాక గృహ రుణాలు రద్దు చేస్తుందని, జగన్ చెప్పిన వన్ టైమ్ సెలిట్మెంట్ కి ఎవరూ వెళ్లొద్దని పిలుపునిచ్చారు చంద్రబాబు.

అవును… టీడీపీ అధికారంలోకి వచ్చేస్తాదంట.. అప్పటివరకూ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల విషయంలో ఎవరూ తొందరపడొద్దని చెబుతున్నారు బాబు. ఇంతకు మించిన హాస్యపు మాటలు మరొకటి ఉంటాయా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేదెపుడు? ఈ రుణాలు రద్దు చేసేదెప్పుడు? తన హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకే కేటాయింపులు చేయలేక వదిలేసిన బాబు, ఇప్పుడు ఏకంగా గృహ రుణాలు రద్దు చేస్తారంటే నమ్మేదెవరు?

చంద్రబాబు హామీల విషయంలో… ప్రజల నమ్మకాన్ని ఏనాడో కోల్పోయారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావాలంటే… జగన్ ఏదైనా తప్పు చేసి, ప్రజావ్యతిరేకత మూటగట్టుకోవడం మినహా… టీడీపీ తనకు తానుగా ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచే పరిస్థితి లేదు! చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా… ప్రజల్లోకి ప్రత్యక్షంగా రావడం మానేశారు. అయినా కూడా… చంద్రబాబు వాస్తవాల్లో బ్రతకకుండా… మరోమారు జనాలను “మాఫీ”ల పేరుతో మాయచేయాలని చూస్తే… రాష్ట్రం మొత్తం మంగళగిరే అన్న విషయం బాబు మరిచిపోకూడదు!

Read more RELATED
Recommended to you

Latest news