తెలంగాణ రాజకీయాల్లో మొన్నటివరకు హుజూరాబాద్ ఉపఎన్నికపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగేవి. కానీ ఈ మధ్య హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి పెద్దగా చర్చలు జరగడం లేదు. ఇలా సడన్‌గా హుజూరాబాద్ మ్యాటర్ సైడ్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఎప్పుడైతే ఈటల రాజేందర్ టిఆర్‌ఎస్‌ని వదిలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పుడే, హుజూరాబాద్ ఉపఎన్నిక హడావిడి మొదలైంది. ఓ వైపు ఈటల బిజేపిలో చేరి తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. అటు అధికార టిఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లోనే మకాం వేసి హడావిడి చేశారు.
ఇటు హరీష్ రావు…టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని వెంటబెట్టుకుని వూరు వూరు తిరుగుతూ, ఈటలపై విమర్శలు చేసుకుంటూ వెళుతున్నారు. అలాగే సిఎం కేసిఆర్ కూడా హుజూరాబాద్‌పై స్పెషల్‌గా ఫోకస్ చేసి, అక్కడ ప్రజలని ఆకర్షించడానికి ఎన్ని కార్యక్రమాలు చేశారో చెప్పాలసిన పని లేదు. అయితే టిఆర్‌ఎస్ ఎన్ని చేసిన అవి కేవలం ఈటల రాజీనామాతోనే జరుగుతున్నాయని ప్రజలు అర్ధం చేసుకున్నారనే చెప్పొచ్చు.
అయితే నోటిఫికేషన్ రాకముందే ఈటల, టిఆర్‌ఎస్‌ల మధ్య వార్ తీవ్రమైంది. కానీ సడన్‌గా హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల సంఘం ఇప్పటిలో హుజూరాబాద్ ఎన్నిక నిర్వహించడానికి సిద్ధమైనట్లు కనిపించడం లేదు. కేసిఆర్ కావాలనే ఎన్నిక వాయిదా వేసుకున్నారనే టాక్ ఉంది. ఎన్నిక వాయిదా పడటంలో హుజూరాబాద్ ప్రజల్లో మార్పు వస్తుందని, ఈటలకు ఎదురుగాలి వీయడం మొదలైందని కథనాలు రావడం మొదలయ్యాయి.
కానీ వాస్తవాన్ని చూస్తే హుజూరాబాద్‌లో అలాంటి పరిస్తితి లేదనే తెలుస్తోంది. టిఆర్‌ఎస్ ఎన్ని కార్యక్రమాలు చేసినా హుజూరాబాద్ ప్రజలు మనసు మారేలా కనిపించడం లేదు. ఇక్కడ మెజారిటీ ప్రజలు ఇంకా ఈటల వైపే ఉన్నారని తెలుస్తోంది. ఆయన పట్ల అభిమానం, సానుభూతితోనే ఉన్నారు. ఎన్నిక వాయిదా పడిన అవేమీ తగ్గవని చెప్పొచ్చు. కాబట్టి హుజూరాబాద్‌లో ఈటలని ఎదురుగాలి కాదు కదా…కనీసం కారు స్పీడుకు వచ్చే గాలి కూడా ఏం చేయలేదనే తెలుస్తోంది.