బాలయ్యబాబు శిష్యుడికి నామినేటెడ్ పదవి..? చంద్రబాబు హామీ

-

త్వరలోనే నామినెటెడ్ పదవుల భర్తీ ఉంటుందని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటించారు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికీ.. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో నెల్లూరులో ఆశావాహుల ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం జరుగుతోంది.. పదవులను దక్కించుకునేందుకు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట.. ఈసారి ఎలాగైన నామినెటెడ్ పదవి దక్కించుకోవాలని కొందరు నేతలు పార్టీ పెద్దలను సైతం కలిసి.. పార్టీ కోసం తాము చేసిన కార్యక్రమాలను వివరిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది..

ఉమ్మడి నెల్లూరుజిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.. సీనియర్లు, జూనియర్లు కలిసి పనిచేశారు.. వారికి కూటమి పార్టీలు తోడవ్వడంతో ఓట్లుకొల్లగొట్టారు.. టిక్కెట్లు రాని నేతలకు
అధికారం రాగానే నామినెటెడ్ పదవి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.. దీంతో హామీ పొందిన నేతలందరూ చంద్రబాబును కలుస్తున్నారట.. ఎన్నికల సమయంలో తమకు మాటిచ్చారని..

మాట నిలుపుకోవాలని అభ్యర్దిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. వీరితో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శిష్యుడుగా గుర్తింపు తెచ్చుకున్న టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి కీలక పోస్ట్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది.. నెల్లూరు సిటీ టిక్కెట్ ను ఆయన ఆశించారు.. కానీ ఇక్కడి నుంచి నారాయణ పోటీ చేశారు.. ఆయన గెలుపు కోసం కోటంరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేశారు.. ఈ సమయంలోనే కోటంరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారట.. బాలయ్యతో సంబంధం లేకుండానే.. ప్రాధాన్యత కల్గిన నామినెటెడ్ పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారని ఆయన అనుచరులు చెబుతున్నారు.. దీంతో నెల్లూరుఅర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోటంరెడ్డికి రాబోతుందని నెల్లూరులో టాక్ నడుస్తోంది..

కోటంరెడ్డితో పాటు.. జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కోవూరు టీడీపీ ఇన్చార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఉదయగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కావలి నుంచి సుబ్బానాయుడు,ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడులు మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని చర్చ నడుస్తోంది.. తమను పరిగణలోకి తీసుకోవాలని..బయోడేటాలను మంత్రులకు ఇస్తున్నారట.. ఈ పదవుల పందేరం పై మరో పది రోజుల్లో క్లారిటీ రాబోతుందని జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version