ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడలో అడుగుపెట్టనున్నారు…చాలా రోజుల తర్వాత బాబు గుడివాడకు రానున్నారు…గుడివాడలో మినీ మహానాడు పేరిట భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి…గుడివాడలో టీడీపీ సత్తా తగ్గలేదని రుజువు చేయాలని చూస్తున్నారు. సభ ద్వారా కొడాలి నానికి చెక్ పెట్టగలమని చూపించడానికి టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
అసలు గుడివాడ నియోజకవర్గం మొదట నుంచి టీడీపీకి అండగా ఉంటూ వస్తున్న స్థానం….కానీ కొడాలి నాని ఎంట్రీతో గుడివాడలో సీన్ మారిపోయింది. టీడీపీలోనే రాజకీయంగా ఎదిగి…రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి…తనకంటూ సొంత బలాన్ని తెచ్చుకుని నాని వైసీపీ వైపుకు వెళ్ళి…వరుసపెట్టి రెండుసార్లు టీడీపీని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక గుడివాడలో కొడాలి హవా కొనసాగుతుంది..మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి ఏ విధంగా చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడ్డారో తెలిసిందే.. మంత్రి పదవి పోయినా సరే నాని తగ్గట్లేదు. ఇలా బాబుని తిడుతున్న నానికి చెక్ పెట్టాలని టీడీపీ శ్రేణులు కసితో రగిలిపోతున్నాయి…కానీ నాని అధికార బలం ముందు టీడీపీ తేలిపోతుంది. ఇక ఇలాంటి తరుణంలోనే టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు బాబు సిద్ధమయ్యారు.
ఈ నెల 29న గుడివాడలో భారీ సభ ఏర్పాటు చేసి…సభ ద్వారా టీడీపీ సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. ఇక సభ తర్వాత గుడివాడలో టీడీపీ బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి నానికి చెక్ పెట్టడానికి బాబు డైరక్ట్ గా రంగంలోకి దిగుతున్నారు. మరి నానికి చెక్ పెట్టగలరో లేదో చూడాలి.