కృష్ణా జిల్లా ఓట‌ర్ల‌కు చంద్ర‌బాబు మార్క్ బెదిరింపులు..!

-

తాజాగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రిని గ‌మ‌నించిన మేధావులు ఒకింత షాక‌య్యారు. ఆయ‌న ఇప్పుడు జిల్లాల్లోని టీడీపీ ప‌రిస్థితిపై విస్తృత స్థాయి స‌మావేశాల‌కు తెర‌దీశారు. తొలి రోజు స‌మా వేశం అంతా కూడా జ‌గ‌న్‌ను తిట్టిపోయ‌డం, వైసీపీ పైవిరుచుకుప‌డ‌డంతోనే స‌రిపెట్టారు. అదేస‌మ‌యంలో టీడీపీ నేత‌ల‌పై కేసులు పెట్టిన పోలీసులు, వేధింపుల‌కు గురిచేస్తున్న అధికారుల జాబితా త‌న వ‌ద్దంటూ బెదిరింపు రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి సంయ‌మ‌నం ఉండాల‌ని చెప్పుకొచ్చే బాబు ఇప్పుడు అదే సంయ‌మ‌నం కోల్పోయి.. ఇలా వ్యాఖ్యానించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా ఆయ‌న కృష్ణాజిల్లా రాజ‌కీయాల‌పై ఒకింత తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో కేవ‌లం చంద్ర‌బాబు కు ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే గెలిచారు. ఒక‌రు విజ‌య‌వాడ తూర్పు, రెండు గ‌న్న‌వ‌రం. ఇక‌, ఇప్పుడు మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల కార‌ణంగా గ‌న్న‌వరం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ బాధ‌ను ఆవేద‌న‌ను చంద్ర‌బాబు దాచుకోలేక పోయారు. అలాగ‌ని వంశీని ఎక్క‌డా విమ‌ర్శించ‌కుండానే త‌న అక్క‌సు నంతా ప్ర‌జ‌ల‌పై చూపించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది.

కృష్ణా జిల్లా ఓటర్ల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు భారీ ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి.
కృష్ణా నదిలో పై నుంచి నీళ్ళు రాని రోజుల్లో ఎంతో శ్రమపడి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిస్తే కృష్ణా జిల్లాలో టీడీపీని కేవలం రెండు స్థానాల్లోనే గెలిపిస్తారా? రాత్రింబవళ్లూ పనిచేస్తే ఇలాంటి ఫలితం రావడం బాధ కలిగించింది. ఏం మాయ జరిగిందో అర్థం కావడం లేదు. నన్ను అవమానించి టీడీపీని బలహీనపరచాలని కలలు కంటున్నారు. నేను అలాంటి వాటికి భయపడే వాడిని కాను.

టీడీపీ దమ్మున్న పార్టీ. అంటూ బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇటు సామాన్యుల‌ను కూడా క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ప‌సుపు-కుంకుమ ఇచ్చినా.. ప‌ట్టిసీమ క‌ట్టించినా.. అవి ప్ర‌బుత్వం చేయాల్సిన ప‌నులు, ప్ర‌జ‌లు క‌ట్టిన సొమ్ముతో చేసిన ప‌నులు త‌ప్పితే.. బాబు వాటిని ఎగ్జాగ‌రేట్ చేసుకుని వ‌ర్ణించుకోవ‌డం, నేను ప‌ట్టిసీమ ఇచ్చాను కాబ‌ట్టి నాకే ఓటేయాల‌ని ఆయ‌న అన‌డం అంత స‌రికాద‌ని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news