లవ్ జిహాదీ సంస్కృతి అంతమే లక్ష్యం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

-

మూగ-చెవిటి పిల్లలను మతం మార్చే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఢిల్లీ ముంబై ఘటనలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. అలాంటి వారు ప్రణాళికాబద్ధంగా పిల్లల ద్వారా కుటుంబాన్ని సృష్టిస్తున్నారు.
డిజిటల్ విప్లవ యుగంలో, సాంకేతికత సాయంతో సోషల్ మీడియాతో సహా అనేక ఇతర మాధ్యమాల ద్వారా హిందు సంస్కృతిపై దాడి జరుగుతోంది. దీనిని నివారించాలంటే అవగాహన,అప్రమత్తత చాలా ముఖ్యం.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే చెప్తున్నారు.గౌతమబుద్ధ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంస్కృతితో ఆడుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. డిజిటల్ యుగం ఎంత ప్రయోజనకరమో అంతే ప్రమాదకరమన్నారు. యువత రోజుకు సగటున ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు స్మార్ట్ ఫోన్లపై గడుపుతున్నారు.ఈ సమయాన్ని, పాజిటివ్ థింకింగ్ తో విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఫర్వాలేదు కానీ ఈ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోని యువత సమాజానికి, దేశానికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. శక్తిని ఎలా ఖర్చు చేయాలో ఆలోచించి దేశ నిర్మాణం మరియు సమాజం పట్ల బాధ్యతను నెరవేర్చాలని యువతకు సీఎం సూచించారు.

YOGI

సంస్కృతి,సంప్రదాయాలే భారతదేశానికి గుర్తింపు అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతదేశ సంస్కృతితో ఆడుకోవడాన్ని అసలు సహించబోమన్నారు.మొఘలులు దేవాలయాలపై దాడి చేసే వరకు దేశాన్ని పాలించారు. వారు దేవాలయాలపై దాడి చేయడం ఎప్పుడు మొదలు పెట్టారో అప్పటినుంచి వారు నాశనం అయ్యారని గుర్తుచేశారు. రాజ్యాలను పోగొట్టుకున్న ఔరంగజేబు వారసులు కోల్కతా లో రిక్షాలు లాగుతున్నారని పేర్కొన్నారు.హిందు సంస్కృతి చాలా గొప్పదని స్పష్టం చేశారు.లవ్ జిహాదీ మాయలో పడవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news