అధికార వైసీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది…సాధారణంగా ఏ అధికార పార్టీలోనైనా ఆధిపత్య పోరు ఉంటుంది…అయితే వైసీపీలో మాత్రం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది..ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదొక నియోజకవర్గంలో నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది…నేతల మధ్య తగాదాలు జరుగుతూనే ఉన్నాయి..ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయాల్సిన వారు…ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు.
ఇక ఇటీవల కృష్ణా జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు బాగా ఎక్కువగా కనిపిస్తోంది…అసలు మొదట నుంచి గన్నవరంలో రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే…ఎప్పుడైతే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చారో..అప్పటినుంచి సీన్ మారిపోయింది…వంశీ వచ్చిన దగ్గర నుంచి వైసీపీలో రచ్చ జరుగుతూనే ఉంది…వంశీకి..యార్లగడ్డ వెంకట్రావుకు పడటం లేదు…అటు వంశీకి..దుట్టా రామచంద్రరావుకు వార్ నడుస్తోంది. అంటే వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ, దుట్టాలు ఉన్నారు…ఇటీవల కాలంలో ఈ వార్ మరింత ముదిరింది…ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.
ఇక మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఈ ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది..ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరికి పడటం లేదు…ఇటీవల బహిరంగంగానే రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది..అలాగే పెడన నియోజకవర్గంలో కూడా నేతల మధ్య పోరు నడుస్తోంది…అటు కైకలూరులో అదే పరిస్తితి..ఇలా జిల్లాల్లో ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. మరి ఈ పోరు వల్ల కృష్ణాలో వైసీపీకి ఎంత నష్టం జరుగుతుందో చూడాలి.