ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారనే విషయం విదితమే. అదే రోజు రాత్రి 7 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఆ కార్యక్రమానికి కేసీఆర్, జగన్‌లు ఇద్దరూ కలసి హాజరు కానున్నారట.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేసిన ఉద్యమ సారథి ఒక వైపు.. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజల విశ్వాసంతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నేత మరొకరు.. వారే కేసీఆర్, జగన్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇద్దరూ స్నేహపూర్వకంగానే ఉన్నారు. 2014లో జగన్ అధికారంలోకి వస్తారని కేసీఆర్ అన్నారు. కానీ అది జరగలేదు. అయినా జగన్ పాదయాత్రతో ప్రజలకు దగ్గరై ఇప్పుడు ఏపీలో సీఎం అవబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరి కలయిక రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి అంశంలోనూ ఇద్దరూ కలసి ముందుకు సాగుతారని తెలిసింది.
ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ నెల 30వ తేదీన విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అందుకనే ఇప్పటికే జగన్ ఇటు సీఎం కేసీఆర్‌ను, అటు ప్రధాని మోడీలను కూడా తన ప్రమాణ స్వీకారాని ఆహ్వానించారు. అయితే ప్రధాని మోడీ జగన్ ప్రమాణ స్వీకారానికి రావడం మాట అటుంచితే.. ఇటు కేసీఆర్, జగన్‌లు మాత్రం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని తెలిసింది.
ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారనే విషయం విదితమే. అదే రోజు రాత్రి 7 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఆ కార్యక్రమానికి కేసీఆర్, జగన్‌లు ఇద్దరూ కలసి హాజరు కానున్నారట. ఈ క్రమంలోనే 29వ తేదీన కేసీఆర్ విజయవాడకు చేరుకుని మరుసటి రోజు అంటే.. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని తెలిసింది. అటు నుంచి కేసీఆర్, జగన్‌లు ఇద్దరూ కలసి మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని అనుకుంటున్నారట. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఐక్యంగా ఉన్నాయని మోడీకి ఇరు రాష్ట్రాల సీఎంలు ఇన్‌డైరెక్ట్‌గా తెలియజేస్తారట. మరి ఈ విధంగా వ్యవహరించడం వల్ల ముందు ముందు రాజకీయాల పరంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూస్తే తెలుస్తుంది..!