రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్ధేశంతో నే రైతులును వరి వేయద్దని ముఖ్య మంత్రి కేసీఆర్ అంటున్నారని బీజేపీ నేత రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్ణయంతో రైతులు వరి వేయకుండా భూములను బీడు భూములుగా మారితే అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని సీఎం కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారని విమర్శించారు. అలాగే టీఆర్ఎస్ నేతలు చావులు డప్పులు కొట్టడం, పీఎం మోడీ దిష్టి బోమ్మలు తగల బెట్టడం పై తము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
సీఎం కేసీఆర్ వెంటనే పీఎం మోడీ కి క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ ప్రధాని దిష్టి బోమ్మలు దహనం చేసిన వారిపై డీజీపీ కేసులు నమోదు చేయాలని అన్నారు. నేడు జరిగిన ఘటనను ఖండిస్తూ మంగళ వారం కేసీఆర్ దిష్టి బోమ్మలను దహనం చేస్తామని ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించినా.. మంత్రులను ఎందుకు ఢిల్లీ కి పంపించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న రైతులతో సీఎం కేసీఆర్ ఆటలు ఆడుతున్నారని అన్నారు.